Home /News /crime /

RAJASTHAN HORROR 14 YEAR OLD GIRL MOLESTED INSIDE DELIVERY ROOM OF GOVERNMENT HOSPITAL AT KNIFE POINT PAH

Shocking: సర్కారు ఆస్పత్రిలో దారుణం.. డెలివరీ రూమ్ లో బాలికపై అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: బాలిక ఆరోగ్యం బాగాలేదని సర్కారు ఆస్పత్రికి వెళ్లింది. ఆమెపై తన వంతు కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో డాక్టర్ పిలిచారని ఒక బాలుడు రూమ్ కు తీసుకెళ్లాడు.

ప్రభుత్వాలు మహిళలు వేధింపులను నిరోధించడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మార్పులు రావడం లేదు. దిశ, నిర్భయ, పోక్సో చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై దాడులు, హింసలు (Harassment)  జరుగుతునే ఉన్నాయి. మహిళలు.. తల్లికడుపులో తప్ప.. ప్రతి చోట వేధింపులకు, అఘాయిత్యాలకు గురౌతుంది. ఇప్పటికే అనేక అఘాయిత్యాలు, దాడుల సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఇలాంటి మరోక ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు..రాజస్థాన్ లో (Rajasthan) దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఈ ఘటన మే 16 న జరిగింది. బర్మన్ పట్టణంలో ఈ ఉదంతం జరిగింది. 14 ఏళ్ల బాలిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో తన సోదరుడితో కలిసి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఎక్కువ మంది ఉండటంతో తమ వంతు కోసం వెచిచూస్తున్నారు. ఈక్రమంలో ఏవో సామాను కొనేందుకు బాలికను అక్కడే కూర్చోబెట్టి ఆమె సోదరుడు సూపర్ మార్కెట్ వెళ్లాడు. అప్పుడు ఆమెపై నసీర్ ఖాన్ అనే బాలుడు కన్నేశాడు. బాలిక దగ్గరకు వెళ్లి డాక్టర్ పిలుస్తున్నారంటూ చెప్పాడు. డెలివరీ రూమ్ కు తీసుకెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారం (Rape on girl)  చేశాడు. దారుణాన్ని వీడియో తీశాడు. ఎవరికైన చెబితే దీన్ని బయటపెడుతానని బెదిరించాడు.

దీంతో బాధితురాలు తీవ్ర భయంతో వణికిపోయింది. ఇంటికి వచ్చాక కూడా బాలిక ప్రవర్తనలో తేడా ఉండటంతో ఇంట్లో వారు ఆమెను ఏమైందని అడిగారు. దీంతో బాలిక జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు మే 19 న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులకు నసీర్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు గతంలో తమ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువును రిపేర్ చేసేందుకు వచ్చాడు. అప్పటి నుంచి అతడు ఆమెను వెంబడిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడిని గాలించడానికి ప్రత్యేకంగా పోలీసులు రంగంలోనికి దిగారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో కూడా గతంలో బాలికపై అత్యాచార ఘటన జరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో  (Delhi) దారుణం జరిగింది. కిడ్నాప్ కు గురైన బాలిక, సాముహిక అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసుల ప్రకారం.. 13 ఏళ్ల బాలిక ఏప్రిల్ 24 సాయంత్రం కూరగాయల కోసం ఇంటి నుంచి బైటకు వెళ్లింది. ఒక ఆటోలో ఎక్కింది. దాన్ని షారుక్ అనే బాలుడు నడుపుతున్నాడు. అతను బాలికకు మాయమాటలు చెప్పాడు. ఆమెకు కూల్ డ్రింక్ ఇచ్చాడు. బాలిక కూల్ డ్రింక్ తాగి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బాలికను  కిడ్నాప్ చేసి టీగ్రీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక ఇంటిలో బాలికకు డ్రగ్స్ ఇచ్చారు.

ఆ తర్వాత.. ఆమెపై మోహిత్ (20), ఆకాష్ (19), షారుక్ (20) లు పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ క్రమంలో బాలిక కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం ఊరంతా పోస్టర్ లు అతికించారు. ఈ క్రమంలో బాలిక టిగ్రీ లో ఉన్నట్లు పోలీసులు ఇన్ ఫార్మర్ ల ద్వారా తెలుసుకున్నారు. ఆ తర్వాత నిందితులు.. బాలికను ఒ రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి పారిపోయారు. వెంటనే స్థానికులు బాలిక విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Harassment, Minor girl raped, Rajasthan

తదుపరి వార్తలు