Home /News /crime /

RAJASTHAN GIRL MOLESTED FOR MONTHS PREGNANT GRANDFATHER AMONG 3 ARRESTED PAH

Shocking:  బాలికపై అమానుషం.. 70 ఏళ్ల ముసలోడు, మరో ఇద్దరితో కలిసి నెలల తరబడి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: బాలిక బలహీనతను ఆసరాగా చేసుకున్నారు. నెలల తరబడి ఆమెపై ముగ్గురు కలసి ఇంట్లోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక అస్వస్థతకు గురయ్యింది.

సభ్యసమాజం తలదించుకునే సంఘటన జరిగింది. కామాంధులు మహిళలు, అమ్మాయిలు, బాలికలను (Harassment) ఎవరిని వదలడం లేదు. కాటికి కాలు జాపిన ముస లోళ్లుకూడా నీచానికి దిగజారుతున్నారు. పశువు కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) ఈ అమానుషం చోటు చేసుకుంది. 12 బాలిక తన తల్లితో పాటు తాత దగ్గర ఉంటుంది. ఆమె తండ్రి 12 ఏళ్ల క్రితమే మరణించాడు. బాలికి తల్లి మానసిక వికలాంగురాలు. ఆమెతో ఎవరితో సరిగ్గా మాట్లాడదు. బాలిక తాత.. తాగుడుకు బానిసయ్యాడు. ఇతను వీరిని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో.. తాత.. మరో ఇద్దరితో కలిసి ఇంట్లోనే బాలికపై అత్యాచారానికి (Rapes girl)  పాల్పడేవారు. నెలల తరబడి బాలికపై అఘాయిత్యం జరిపారు. ఈ క్రమంలో బాలిక ఇటీవల పాఠశాలలో అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఆమెను చూసిన వైద్యులు 5 నెలల గర్భవతి (pregnant)అని తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో బాలిక షాకింగ్ విషయాలు (shocking) వెల్లడించింది. తన తాత.. మరో ఇద్దరు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిపింది. తాత.. స్నేహితుడు రాంలాల్ భీల్ (50), అజయ్ బైర్వా (20), వీరు గత నెలలుగా బెదిరిస్తు.. అఘాయిత్యానికి పాల్పడుతున్నారని బాలిక వాపోయింది. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వీరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది.

Woman Raped By Police :

న్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే ఆమెకు మరింత అన్యాయమే జరిగింది. సమస్యను తీర్చాల్సిన పోలీస్ ఆమెపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర(Maharashtra)లోని ఠాణెలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ (27) కొద్దికాలం క్రితం ఓ ఫిర్యాదు చేయడం కోసం నవ్ గర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. అయితే అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని ఫ్లాన్ వేశాను. ఇందులో భాగంగా కేసు విషయమై మాట్లాడుతూ సన్నిహతం పెంచుకున్నాడు. తన బాధలు తీరుస్తానని నమ్మించి ఆమెను అనేక చోట్లకు పిలిచేవాడు. కష్టాలు తీరుతాయని నమ్మి వెళ్లిన ఆ మహిళపై ఆ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ ఆరోపించిందని నవ్ గర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆదివారం కానిస్టేబుల్ ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 376(Rape)కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Harassment, Minor girl raped, Rajasthan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు