• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • RAJASTHAN 3 MEN FINED FOR TRIPLE RIDING ON BIKE DIE IN ACCIDENT AN HOUR LATER SU

ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు ఫైన్.. అంతలోనే ఊహించని విషాదం.. ఇంటికి చేరకముందే..

ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు ఫైన్.. అంతలోనే ఊహించని విషాదం.. ఇంటికి చేరకముందే..

ప్రతీకాత్మక చిత్రం

ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు గాను వారికి అధికారులు జరిమానా విధించారు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరిన వారికి ఊహించని ప్రమాదం ఎదురైంది.

  • Share this:
    పనులు ముగించుకుని ముగ్గురు కార్మికులు ఒకే బైక్‌పై ఇంటికి బయలుదేరారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నందుకు గానూ అధికారులు జరిమానా విధించారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే వారి జీవితాలు ముగిసిపోయాయి. రోడ్డు ప్రమాదంలో వారు ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లాలో చోటుచేసుకుంది. బర్మేర్‌లోని సర్దార్ పోలీస్ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో రామ్‌నివాస్ బిష్ణ్నోయి మాట్లాడుతూ.. బబర్మేర్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న బచ్‌డౌ గ్రామానికి చెందిన ముగ్గురు కార్మికులు బలోత్రా‌లో కూలీ పనులకు వెళ్లారు. కూలీ పనులు ముగించుకుని ముగ్గురు కలిసి ఒకే బైక్‌పై ఇంటికి బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బైక్ బర్మేర్‌కు 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న Khet Singh Ki Pyau గ్రామానికి సమీపంలో ప్రమాదానికి గురైంది.

    ఈ ప్రమాదం గురించి స్థానికులు 108 ఫోన్ చేసి అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు వారు మృతిచెందినట్టు ప్రకటించారు. బైక్‌పై అధిక వేగంతో ప్రయాణించడం వల్లే.. అదుపు తప్పి ప్రమాదం జరిగింది. మృతులను బచ్‌డౌ గ్రామానికి చెందిన మోతారామ్ మేఘ్వాల్, హద్మాన్‌రామ్ మేఘ్వాల్‌, జబారా రామ్‌గా గుర్తించడం జరిగింది.

    గంట ముందే ట్రిపుల్ రైడింగ్‌కు ఫైన్..
    అయితే ప్రమాదం జరగడానికి గంట సేపటి క్రితం వీరికి అధికారులు జరిమానా విధించారు. బర్మేర్ సిటీ గుండా ప్రయాణిస్తున్న సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీరికి జరిమానా విధించినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్ట్ మార్టమ్‌కు సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published: