Home /News /crime /

RAJASTHAN 2 MEN OFFER RIDE TO WOMAN WALKING HOME MURDER HER AFTER RAPE POLICE PAH

Shocking:  లిఫ్ట్ ఇస్తామని మహిళకు ఆఫర్.. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, మరో వ్యక్తితో కలిసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: రాజస్థాన్ లో దారుణ ఘటన వెలుగులోనికి వచ్చింది. ఒక మహిళకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ మీద లిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

Rajasthan 2 Men Offer Ride To Woman:  జైపూర్ లోని దౌసా జిల్లా లోని ఒక గ్రామంలో 35 ఏళ్ల వివాహితపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత.. హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసుల ప్రకారం.. సోమవారం జైపూర్ జిల్లాలోని బస్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బావిలో మహిళ మృతదేహం లభ్యమైందని, అనుమానితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ఒక మహిళ ఆదివారం ఉదయం దౌసాలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు జైపూర్ నుంచి బస్సులో బయలుదేరింది.

ఆమె దౌసాలోని తన గ్రామంలోని బస్టాండ్‌కు చేరుకుంది. ఆమె తల్లిదండ్రుల ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా, నిందితులు ఆమెకు తమ వాహనంలో లిఫ్ట్ ఇచ్చారు. అని దౌసా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్‌కుమార్ గుప్తా తెలిపారు. అయితే, వారు.. ఆమెను గ్రామానికి తీసుకెళ్లకుండా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. సామూహిక అత్యాచారం తర్వాత, వారు మహిళను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని బావిలో పడవేశారని అధికారి తెలిపారు.

ఈ క్రమంలో, బాధితురాలు ఇంటికి చేరుకోకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం దౌసాలోని రామ్‌గఢ్ పచావారా పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన ఫిర్యాదును నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గుప్తా తెలిపారు. నిందితుల్లో కాలూరామ్ మీనా అనే ఒకరిని అరెస్టు చేశామని, మిగతా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Minor boy thrashed, head tonsured for stealing wheat in MP: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. గోధుమలు దొంగిలించాడని ఓ వ్యవసాయ మార్కెట్‌లో బాలుడిని అతి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత గుండు గీయించారు. ఈక్రమంలో.. బాలుడు పారిపోకుండా కొందరు గట్టిగా పట్టుకున్నారు. తీవ్రంగా నోటికొచ్చినట్లు తిట్టారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాగా, తాను ఆ గోధుమలు దొంగిలించలేదని బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో సంభవించింది. గునా జిల్లాలోని మధుసూధన్‌గడ్ వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ వీడియోను పరిశీలించారు. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శివరాజ్ భీల్ అనే వ్యక్తిని గుర్తించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోనికి తీసుకొలేదని పోలీసులు తెలిపారు.

ఆ మైనర్ బాలుడు నిజంగానే గోధుమలు దొంగిలించాడా? లేదా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. బాలుడిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని మధుసూదన్‌గడ్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో అనూప్ భార్గవ తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, Rajasthan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు