రాజన్న సిరిసిల్ల జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసులు..

కష్టాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీసులే లంచాలకు ఎగబడ్డారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో జరిగింది.

news18-telugu
Updated: January 3, 2020, 6:07 PM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కష్టాల్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పోలీసులే లంచాలకు ఎగబడ్డారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో జరిగింది. వివరాల్లోకెళితే.. గంభీరావుపేటకు చెందిన సింహాచలం తన ఇంటి అవసరాల కోసం ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని విడిచిపెట్టేందుకు రూ. 50వేలు డిమాండ్ చేశారు. రూ. 10వేలు ఇస్తానని అతడు చెప్పినా వినకపోవడంతో ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో వల పన్నిన అధికారులు.. పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. సింహాచలం నుంచి కానిస్టేబుల్ కనకరాజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ కేసులో ఎల్లారెడ్డిపేట సీఐ లింగమూర్తి, గంభీరావుపేట ఎస్ఐ అనిల్ కుమార్, కానిస్టేబుల్ కనకరాజులను అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటన ఏకంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గంలో చోటుచేసుకోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 3, 2020, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading