నువ్వు కోరుకున్నట్టే చనిపోతున్నా.. ఆమెకు చివరి మెసేజ్ పంపించి ఆత్మహత్య..

Student Commits Suicide : బుధవారం రాత్రి తోటి విద్యార్థులంతా నిద్రపోయాక.. బిల్డింగ్ పైకి వెళ్లిన శ్రీనివాస్.. బట్టలు ఆరేసే తాడుతో ఓ కొయ్యకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

news18-telugu
Updated: March 29, 2019, 3:31 PM IST
నువ్వు కోరుకున్నట్టే చనిపోతున్నా.. ఆమెకు చివరి మెసేజ్ పంపించి ఆత్మహత్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తాను ఇష్టపడ్డ అమ్మాయి తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున గదిలో అతను ఉరేసుకుని వేలాడటం గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించడంతో విషయం వెలుగుచూసింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతుడు మల్లాది శ్రీనివాస్(18), కత్రేనికోన మండలానికి చెందిన ఎర్ర యానాం గ్రామానికి చెందినవాడు. రాజోల్ బీసీ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న అతను.. ప్రస్తుతం వార్షిక పరీక్షలు రాస్తున్నాడు. బుధవారం రాత్రి తోటి విద్యార్థులంతా నిద్రపోయాక.. బిల్డింగ్ పైకి వెళ్లిన శ్రీనివాస్.. బట్టలు ఆరేసే తాడుతో ఓ కొయ్యకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గురువారం తెల్లవారుజామున విద్యార్థులు అతని మృతదేహాన్ని గుర్తించి సిబ్బందికి తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. 'నువ్వు కోరుకున్నట్టే చనిపోతున్నాను' అని ఓ అమ్మాయికి పంపించిన మెసేజ్ కనిపించింది. దీన్ని బట్టి ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. వన్ సైడ్ లవ్ కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
First published: March 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading