ఈ రోజుల్లో వివాహ బంధాన్ని గౌరవించేవాళ్లు ఎంతమంది ఉన్నారో.. ఆ బంధాన్ని మంటగలిపే ఘనులు అంతమందే ఉన్నారు. మూడుముళ్ల బంధాన్ని అపహాస్యం చేయడాన్ని సహించలేని కొందరు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాత్కాలిక సుఖాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పక్కింట్లో ఉండే వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. తన పద్ధతి మార్చుకోకపోవడంతో దారుణ హత్యకు గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari) రాజమండ్రిలోని బొమ్మూరు బత్తిన నగర్ కు చెందిన ఎం దుర్గా ప్రసాద్.. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తన్నాడు. ఇతడికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. దుర్గాప్రసాద్ పక్కింట్లో రమేష్ అనే వ్యక్తి కుటుంబంతో నివాసముంటున్నాడు. రమేష్ స్థానికంగా ఓ బార్ లో పనిచేస్తున్నాడు.
ఐతే దుర్గాప్రసాద్.. రమేష్ భార్యతో వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకున్నాడు. ఈ విషయంలో రమేష్ కు తెలియడంతో తప్పని వారించాడు. అయినా దుర్గాప్రసాద్ గానీ, రమేష్ భార్యగానీ పద్ధతి మార్చుకోకపోవడంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా భార్య వివాహేతర సంబంధానికి చెక్ పెట్టాలని రమేష్ స్కెచ్ వేశాడు. వారం రోజుల క్రితం భార్యపిల్లలను పుట్టింటికి పంపించాడు. దుర్గాప్రసాద్ ని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించాడు.
ఈ క్రమంలో ఆదివారం దేవీ చౌక్ ప్రాంతానికి వచ్చిన దుర్గాప్రసాద్ ను వెంబడించాడు. వాంబే కాలనీ వద్ద కత్తితో దాడిచేసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు అదివారం సాయంత్రం రమేష్ ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు మరో ఇద్దరు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఇటీవల కడప జిల్లాలో (Kadapa District) ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కడపకు చెందిన నందిని అనే మహిళకు గతంలోనే పెళ్లైంది. ఐతే భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోవడంతో మైలవరంలోని రాజా ఫౌండేషన్ లో చేర్పించారు. అక్కడ ఉండగా రుక్మిణమ్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం కుదరడంతో జమ్మలముగు మండలం మోరగుడిలో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ క్రమంలో పక్కింట్లో ఉంటున్న శ్రీనివాసులు అనే అటో డ్రైవర్ తో నందినికి పరిచయం ఏర్పడింది.
ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్న శ్రీనివాస్.. ఆమెను తీసుకెళ్లి రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత భర్త రెండో పెళ్లి చేసుకున్న విషయం శ్రీనివాసులు మొదటి భార్యకు తెలియడంతో అతడు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో నందిని జమ్మలమడుగు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అనంతపురం జిల్లాలో ఓ మహిళ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి పోలీసులకు చిక్కింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Extramarital affairs, Rajahmundry