రాజమండ్రిల దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి ఓ 16 సంవత్సరాల బాలిక మీద కొందరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెను నాలుగు రోజుల పాటు ఏడుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. చిత్ర హింసలు పెట్టారు. అనంతరం వారు ఆమెను వారు పోలీస్ స్టేషన్ ఎదుటే పడేసి వెళ్లిపోయారు. ఏడుగురు కామాంధులు నాలుగు రోజుల పాటు. మైనర్ బాలిక ను బంధించి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను రాజమండ్రి లోని పోలీస్ స్టేషన్ బయట వదిలేసి వెళ్లి పోయారు. ఆ బాలికను ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాంగ్ రేప్ కు గురైన బాధిత బాలికను రాజమండ్రి పట్టణం లోని ఉన్న ఓ చెప్పుల దుకాణం లో సేల్స్ గర్ల్ గా పని చేస్తోంది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని రాజమండ్రి పోలీసులు తెలిపారు. బాధితురాలు తమ గోడును ఓ మహిళా కానిస్టేబుల్కు చెప్పుకొంది. అయితే, ఏదో అబద్దం చెబుతుందని ఆ కానిస్టేబుల్ నమ్మలేదు. కానీ, ఆ తర్వాత స్థానిక రాజకీయ నేతలకు విషయం తెలిసి వారు పోలీసులకు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.