జర్నలిస్టుపై రైల్వే పోలీసుల దాడి.. నోట్లో మూత్రం పోసి..

Police attack on Journalist: పిడిగుద్దులు కురిపిస్తూ, కడుపులో గుద్దుతూ అమిత్‌ను దారుణంగా చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు బాధ్యుడైన రైల్వే పోలీసుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 12:34 PM IST
జర్నలిస్టుపై రైల్వే పోలీసుల దాడి.. నోట్లో మూత్రం పోసి..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 12, 2019, 12:34 PM IST
ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారు జామున ఓ సంఘటనను వీడియో తీయడానికి వెళ్లిన జర్నలిస్టుపై రైల్వే పోలీసులు తమ ప్రతాపం చూపించారు. రైలులో అనధికారిక వ్యాపారుల (హాకర్స్‌)పై కథనాన్ని ప్రచురించినందుకు గాను రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ రాకేష్ కుమార్ జర్నలిస్టు అమిత్‌శర్మపై దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ, కడుపులో గుద్దుతూ అమిత్‌ను దారుణంగా చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు బాధ్యుడైన రైల్వే పోలీసుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. తనను దారుణంగా కొట్టి, కెమెరాను ధ్వంసం చేశారని చెప్పాడు. లాకప్‌లో వేసి బట్టలూడదీసి, నోట్లో మూత్రం పోశారని అన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో విరివిగా షేర్‌ అవుతూ వైరల్‌ కావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనకు బాధ్యుడైన అధికారి రాకేష్‌కుమార్‌తోపాటు మరో రైల్వే కానిస్టేబుల్‌ సునీల్‌ కుమార్‌ను అధికారులు సస్పెండ్‌ చేశామని వెల్లడించారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...