వృద్ధురాలిపై దాడిచేసి కుక్కలు వదిలిన రైల్వే ఉద్యోగి.. గుంటూరులో దారుణం

రంజిత్ నాయక్ అతని భార్య ఇద్దరు కలిసి వృద్దురాలిపై దాడి చేశారు. అనంతరం ఆమె పైకి పెంపుడు కుక్కలను వదిలారు

news18-telugu
Updated: July 8, 2020, 10:59 AM IST
వృద్ధురాలిపై దాడిచేసి కుక్కలు వదిలిన రైల్వే ఉద్యోగి.. గుంటూరులో దారుణం
వృద్ధురాలి ఇంటిపైకి కుక్కలు వదిలిన రైల్వే ఉద్యోగి
  • Share this:
వృద్ధురాలిపై దాడి చేసి కుక్కలను వదిలి అమానుషంగా ప్రవర్తించాడో రైల్వే ఉద్యోగి. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగింనందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలో నివాసం ఉంటున్న భూక్యా రంజిత నాయక్ అనే రైల్వే ఉద్యోగి తన భార్య అవసరం నిమిత్తం అమరావతి మండలం మద్దూరు గ్రామానికి చెందిన రామావత్ చంపల్లి అనే వృద్ధురాలి(70) వద్ద రెండు సంవత్సరాల క్రితం ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వృద్ధురాలి అనారోగ్య కారణాల దృష్ట్యా పది రోజుల నుంచి తాను ఇచ్చిన డబ్బులు కోసం రంజిత్ నాయక్ ఇంటికి వెళ్లి అడుగగా డబ్బులు మేము ఇవ్వాల్సిన పని లేదని వృద్ధురాలిని బయటకు గెంటివేసి దుర్భాషలాడాడు.


ఐతే ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులు పెద్దమనుషుల వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాల్సిన విషయం తెలియచేశారు. అనంతరం పెద్దమనుషుల సమక్షంలో డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకొని ఈ రోజు డబ్బులు చెల్లించెట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తనకు రావలసిన డబ్బులు కోసం వృద్ధురాలు రంజిత్ నాయక్ ఇంటికి వెళ్తే.. రంజిత్ నాయక్ అతని భార్య ఇద్దరు కలిసి వృద్దురాలిపై దాడి చేశారు. అనంతరం ఆమె పైకి పెంపుడు కుక్కలను వదిలారు. విషయం తెలుసుకున్న వృద్ధురాలి బందువులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 7, 2020, 9:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading