పోర్న్ స్టార్‌తో రాహుల్ గాంధీ... ఫోటో వైరల్... సోషల్ మీడియాలో దుమారం...

రెండేళ్ల క్రితం రాహుల్ దిగిన ఫోటో వైరల్... ‘పోర్న్ స్టార్‌తో పప్పు’ పేరుతో పోస్ట్ వైరల్ చేస్తున్న నెటిజన్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 19, 2019, 3:23 PM IST
పోర్న్ స్టార్‌తో రాహుల్ గాంధీ... ఫోటో వైరల్... సోషల్ మీడియాలో దుమారం...
నాథలియా పోస్ట్ చేసిన ఫోటో
  • Share this:
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఓ పోర్న్ స్టార్‌తో కలిసి ఫోటో ఫోజివ్వడం వివాదాస్పదమైంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోను చూపించి... బీజేపీ వర్గాలు... రాహుల్ గాంధీ బ్రహ్యచర్యాన్ని విమర్శిస్తుంటే, కాంగ్రెస్ వర్గాలు ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటో... నిజానికి దాదాపు రెండేళ్ల క్రితం తీసింది. సెప్టెంబర్ 13, 2017న ఓ ఈవెంట్‌కు హాజరైన స్పానిష్ నటి నథలియా రామోస్‌, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి ఫోటో దిగింది. దాన్ని తర్వాతి రోజు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది నథలియా. ‘రాత్రి ఈవెంట్‌లో రాహుల్ గాంధీని కలిశాను. అతన్ని కలిసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది...’ అంటూ కామెంట్ పెట్టిందామె.బెర్గూరెన్ ఇన్సిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ ఫోటోను పోస్ట్ చేసిన కొందరు నెటిజన్లు... ‘పోర్న్ స్టార్‌తో పప్పు...’ పేరుతో వైరల్ చేశారు. ‘అమెరికాలో పోర్న్ స్టార్ నథలియా రామోస్‌తో కలిసి ఓ విలాసవంతమైన హోటెల్‌లో ఉన్నాడు మన పప్పు. ఈ రోజు యువరాజు రూ. 4000 ఖర్చు పెట్టాడు. అది కూడా బ్యాంకు క్యూలో నిలబడి విత్‌డ్రా చేసుకుని...’ అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే నిజానికి నథలియా రామోస్ పోర్న్ స్టార్ కాదు... అమెరికాలో ప్రముఖ టీవీ నటి, హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన హీరోయిన్. అయితే హాట్ హాట్ బికినీల్లో నథలియా పెట్టిన పోస్ట్‌ల కారణంగా ఆమెను... నథలియా రామోస్ అనే పేరు గల పాపులర్ పోర్న్ స్టార్ అని భావించిన కొందరు ఇలా వార్తలు వ్యాపింపచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...


స్కూళ్లలో సినిమా పాటలు బంద్... బడిలో ఇకపై ఆ పాటలు బ్యాన్...

ఐటీ ఉద్యోగులూ బీ కేర్‌ఫుల్.. తాగి వాహనం నడిపితే తల ఎత్తుకోలేరు..‘దారిదోపిడి కుటుంబం’... చోరీలు చేస్తున్న తల్లీకొడుకు అరెస్ట్... ఎంత కాజేశారో తెలిస్తే...

First published: January 19, 2019, 9:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading