హైదరాబాద్ లో సంచలనం రేపిన పబ్బులో డ్రగ్స్ పార్టీ ఉదంతంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఘాటుగా స్పందించాడు. నిహారిక తండ్రి నాగబాబు లాగానే రాహుల్ సైతం పోలీసుల తీరును ఆక్షేపించాడు. వివరాలివే..
విశ్వనగరం హైదరాబాద్ లో కలకలం సృష్టించిన డ్రగ్స్ పార్టీ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ సేవిస్తూ యువత పట్టుపడటం, అందులో చిరంజీవి తమ్ముడి కూతరు నిహారికా కొణిదెల, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ కొడుకులు, మాజీ డీజీపీ కూతురు, పలువరు బడాబాబులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలూ ఉన్నట్లూ వెల్లడైంది. పార్టీకి కోడ్ లాంగ్వేజ్ ద్వారా డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు కునాల్, వంశీధర్‌రావు చాట్‌లో వీఐపీలున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఉదంతంపై తాజాగా రాహుల్ సిప్లిగంజ్ ఘాటుగా స్పందించాడు. నిహారిక తండ్రి నాగబాబు లాగానే రాహుల్ సైతం పోలీసుల తీరును ఆక్షేపించాడు.
ఫుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ పార్టీపై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు దాడి చేయడం, అక్కడ పట్టుబడిన వాళ్లలో మెగా డాటర్ నిహారిక సుమారు 150 మంది సెలబ్రిటీలు, సెలబ్రిటీల పిల్లలు ఉండటం తెలిసిందే. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. డ్రగ్స్ సరఫరాను అడ్డుకోలేకపోయారంటూ బంజారాహిల్స్ సీఐపై వేటు వేసి, ఏసీపీకి మెమో జారీ చేశారు. కాగా, ఈ కేసులో నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని నాగబాబు ఓ సందేశాన్ని విడుదల చేశారు.
‘పబ్‌లో నిహారిక ఉండడం వల్లే నేను స్పందిస్తున్నాను. నిర్ణీత సమయానికి మించి పబ్ నడుపుతున్నారనే.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. నా కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్. నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారు. ఊహాగానాలకు తావివ్వకూడదనే దీనిపై స్పందిస్తున్నాను. ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని నాగబాబు పేర్కొన్నారు. నాగబాబు వీడియో సందేశం తర్వాత రాహుల్ సిప్లిగంజ్ మీడియాతో మాట్లాడారు..
డ్రగ్స్ వ్యవహరంతో తనకు సంబంధంలేదని, ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లానని, ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదని రాహుల్ సిప్లిగంజ్ చెప్పాడు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికి చెడ్డ పేరు వచ్చిందని వాపోయాడు. అసలు లేట్‌నైట్ వరకు పబ్ నిర్వహిస్తుంటే పోలీసులు యాజమాన్యాన్ని నిలదీయాలి, కానీ ఇలా మమ్మల్ని పలిచి ఇబ్బంది పెట్టడం ఏంటి? అని రాహుల్ ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని, ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేనప్పడు తాను భయపడాల్సిన అవసరం లేదని సింగ్ వ్యాఖ్యానించాడు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.