Harassment of Women: వీళ్లు మామూలోళ్లు కాదు.. నమ్మించి చాటింగ్.. తర్వాత చీటింగ్

పోలీసులు అరెస్టు చేసిన సూరజ్ ఆచారి, జగన్ తంగ రాజు

Harassment of Women: సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.

  • Share this:
    ప్రస్తుతం సోషల్ మీడియా నేరాలకు అడ్డాగా మారింది. అనేక మంది మోసగాళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. ముందుగా మాయమాటలు చెప్పి.. వారితో చాటింగ్ చేసి.. కొద్ది రోజులకు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. నీ పర్సనల్ ఫొటోలను మీ కుటుంబ సభ్యులు, మిత్రులకు పంపిస్తామంటు బెదిరిస్తూ డబ్బులు లాగుతున్నారు. మరి కొందరు సైకోలు మహిళలతో క్లోస్ గా ఉంటూ వారి వద్ద నుంచి సేకరించిన ఫొటోలను తర్వాత కుటుంబ సభ్యులకు పంపించి జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన ఇద్దరిని బుధవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో బాధిత యువతి కర్ణాటక రాష్ట్రంలోని కుంత ప్రాంతానికి చదువుకోవడానికి వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి గదిని అద్దెకు తీసుకుని ఉండేది. అయితే వీరి ఉండే ప్రాంతంలో ఉండే సూరజ్ ఆచారి అనే వ్యక్తి ఈ యువతికి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అయితే ఆ యువతి అతడిని ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఓకే చేయడంతో ఇద్దరూ కొన్ని రోజులు ఫేస్ బుక్ లో చాటింగ్ చేశారు.

    ఇలా ఏడాది గడిచిన తర్వాత అతడు ఆ అమ్మాయికి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే బాధితురాలు అందుకు అంగీకరించలేదు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న నిందితుడు ఆమెతో ఫ్రెండ్ లాగా చాటింగ్ చేస్తూ ఆమె ఫొటోలు సేకరించాడు. కొద్ది రోజుల తర్వాత అసభ్యంగా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఆ యువతి చాటింగ్ చేయడం ఆపేసింది. అతని ఫోన్ నంబర్ ను బ్లాక్ లీస్టులో పెట్టింది. అనంతరం అతను ఈ మెయిల్ ద్వారా బాధితురాలిని బెదిరించడం ప్రారంభించాడు. నాతో మాట్లాడకుంటే నీతో చేసిన చాట్, నీ ఫొటోలను మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కు పంపిస్తానని బెదిరించాడు. దీంతో భయపడ్డ ఆ యువతి అతడి నంబర్ ను అన్ బ్లాక్ చేసింది. అనంతరం అతడితో అప్పడప్పుడు మాట్లాడేది. అయితే కొద్ది రోజులకు ఆ యువతి ఎంగేజ్ మెంట్ జరిగింది. విషయం తెలుసుకున్న సూరజ్ నీ పెళ్లి రద్దు చేసుకోవాలంటూ అనేక మెసేజ్ లు పంపించాడు. ఈ క్రమంలో ఆ యువతి వివాహం ఈ ఏడాది జనవరిలో జరిగింది.

    అనంతరం కొద్ది రోజులకు ఆ యువతి తన ఎంగేజ్ మెంట్, పెళ్లి ఫొటోలను ఫేస్ బుక్ లో పెట్టింది. ఇది చూసిన సూరజ్ ఆ యువతి జీవితాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. మే నెలలో ఆమె ఫొటోలను ఫేస్ బుక్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నాడు. అనంతరం ఓ ఫేక్ ఫేస్ బుక్ ఖాతాను ప్రారంభించాడు. బాధిత యువతి, ఆమె భర్తకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించాడు. తర్వాత పథకం ప్రకారం ఆ యువతి పాత ఫొటోలను వారికి అసభ్య కామెంట్లతో పంపించడం ప్రారంభించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

    సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ఓ యువతిని డబ్బుల కోసం బెదిరిస్తున్న మరో యువకుడిని సైతం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరులోని జ్యోతిపురానికి చెందిన తంగరాజు అనే వ్యక్తి ఓ యువతిని ఓ ఆన్లైన్ వెబినార్ లో కలిశాడు. అనంతరం ఆమె నంబరు వాట్సాప్ గ్రూపులో నుంచి సేకరించాడు. అనంతరం ఆ యువతితో ఫ్రెండ్లీగా చాటింగ్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి నమ్మించాడు. తర్వాత డబ్బుల అడగడం ప్రారంభించాడు. కొన్ని రోజులకు ఆమె డబ్బులు ఇవ్వడం ఆపేయడంతో నీ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
    Published by:Nikhil Kumar S
    First published: