గంటకెంత తీసుకుంటావ్.. వస్తావా..? అంటూ యువతిని వేధించిన నీచుడు.. బొక్కలో తోసిన పోలీసులు

ప్రతీకాత్మక చిత్రం

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలపై ఒకింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.. ఇందుకు సంబంధించిన ఉదంతాలు బోలెడన్ని ఉన్నా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

 • News18
 • Last Updated :
 • Share this:
  అతడొక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మాస్టర్ గా పని చేస్తున్నాడు. చేసేది నలుగురికి కడుపు నింపే పని. కానీ అతడి వ్యక్తిత్వం మాత్రం అతడి వృత్తి అంత గొప్పది కాదు. వేరే వాళ్ల ఫోన్ ల నుంచి మహిళల నెంబర్లు తస్కరించి.. వారిని వేధింపులకు గురి చేయడం అతడి ప్రవృత్తి. ఇలాగే తన సోదరి మొబైల్ నుంచి ఆమెకు తెలియకుండా ఒక యువతి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆమెకు అర్థరాత్రిళ్లు ఫోన్ చేసి అసభ్యకర సందేశాలు పెట్టడం.. జుగుప్సాకరంగా మాట్లాడటం చేశాడు. రాత్రి పూట ఫోన్ చేసి... ‘ఒక గంట సేపు నాతో గడపటానికి ఎంత తీసుకుంటావ్..?’ ‘ఎంతకొస్తావ్ చెప్పు...’ అంటూ వేధించేవాడు. ఆ నీచుడి బాధలు భరించలేక ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

  గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలపై ఒకింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.. ఇందుకు సంబంధించిన ఉదంతాలు బోలెడన్ని ఉన్నా.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగాల్ కు చెందిన ఛత్రి శ్యామ్.. హైదరాబాద్ కు సరిహద్దుల్లో షామీర్ పేట పక్కన ఉన్న తుర్కపల్లిలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. అతడు తన సోదరి మొబైల్ నుంచి ఆమెకు తెలియకుండా ఒక యువతి నెంబర్ తీసుకున్నాడు. కొద్దిరోజులుగా ఆమెతో మాట్లాడటం.. లైంగికంగా వేధించడం చేసేవాడు. ఆమెకు విషయం అర్థమైంది. దీంతో అతడి ఫోన్ కు స్పందించకుండా ఉంది. కానీ శ్యామ్ మాత్రం తరుచూ విసిగించేవాడు.

  నిందితుడు శ్యామ్....


  రాత్రి పూట సదరు యువతికి whatsappలో అసభ్యకర సందేశాలు పెట్టేవాడు. ‘నాతో గడపటానికి ఒక గంటకు ఎంత తీసుకుంటావ్... వస్తావా..?’ అంటూ మెసేజ్ లు పెట్టేవాడు. అంతేగాక పలు న్యూడ్ ఫోటోలను ఆమెకు షేర్ చేస్తూ అసభ్యకరమైన రాతలు రాసేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరి నుంచి మొబైల్ ఫోన్, సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ... గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఏదైనా సందేశాలు గానీ.. ఫోటోలు గానీ వస్తే వాటికి స్పందించొద్దని.. వారిని బ్లాక్ చేయడం గానీ లేదంటే పోలీసులకు సమాచారం అందించడం చేయాలని సూచిస్తున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: