రాచకొండలో దొంగ అరెస్ట్.. 43 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం..

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ల్యాప్ టాప్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.

news18-telugu
Updated: July 17, 2020, 10:57 PM IST
రాచకొండలో దొంగ అరెస్ట్.. 43 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం..
ల్యాప్ టాప్‌ల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
  • Share this:
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ల్యాప్ టాప్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద 43 ల్యాప్ టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.65 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ శివారులోని మీర్ పేట్‌లో ఓ యువకుడిని పోలీసుల పట్టుకున్నారు. అతడిని విచారిస్తే మొత్తం దొంగతనాల కథ వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కె. రవికిరణ్ రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. 34 సంవత్సరాల రవికిరణ్ గతంలో హన్మకొండ, కోదాడతో పాటు పలు ఇళ్లలో చోరీలు చేశాడు. హైదరాబాద్ ఎల్బీనగర్, పహాడీ షరీఫ్, వనస్థలిపురం, సరూర్ నగర్ లో కూడా పలు చోరీలకు పాల్పడ్డాడు. మొత్తం ఇతడి మీద 18 కేసులు నమోదయ్యాయి. మూడు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి.


గతంలో ఇళ్లు తాళాలు పగలగొట్టి చోరీలు చేసిన రవికిరణ్ ఈ మధ్యకాలంలో కేవలం లాప్ టాప్‌లు మాత్రమే చోరీ చేయడం టార్గెట్ గా పెట్టుకున్నాడు. ప్రతిరోజూ ఉదయం పూట కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తూ ఉంటాడు. రోడ్డుకి దగ్గరగా గుమ్మం ఉండే ఇళ్లు, బ్యాచిలర్స్ ఉండే ఇళ్ల మీద కన్నేస్తాడు. సహజంగా బ్యాచిలర్స్ ఇళ్లకు తాళాలు వేసి.. ఏ షూ ర్యాక్స్‌లోనో, లేకపోతే కిటికీ అద్దాల వెనుక పెడుతూ ఉంటారు. వాటిని గమనించి.. బ్యాచిలర్స్ అలా బయటకు వెళ్లగానే దొంగ లోపలకు వెళ్లి రూమ్‌లో ఉండే ల్యాప్ టాప్స్, మొబైల్ ఫోన్లు, చార్జర్లు చోరీ చేస్తుంటాడు.

రవికిరణ్ వద్ద స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్‌ల వివరాలు

  • డెల్ -8

  • హెచ్ పీ -12
  • లెనోవో -5

  • సోనీ -3

  • కంపాక్ -6

  • ఏసర్ -2

  • ఆపిల్ -1

  • సాంసంగ్ -4

  • ఐబాల్ -1

  • ఇంటెల్ విండోస్ నోట్ పాడ్ - 1

Published by: Ashok Kumar Bonepalli
First published: July 17, 2020, 6:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading