హైదరాబాద్ యువతికి అసభ్య మెసేజ్‌లు, ఫోటోలు... యువకుడి అరెస్ట్

మల్కాజిగిరికి చెందిన ఓ యువతి నంబరును సంపాదించి.. ఆమెతో చాట్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆమెకు అసభ్యకరమైన మెసేజులు, ఫోటోలు పంపించడం ప్రారంభించారు.

news18-telugu
Updated: February 26, 2020, 8:27 AM IST
హైదరాబాద్ యువతికి అసభ్య మెసేజ్‌లు, ఫోటోలు... యువకుడి అరెస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న... మహిళల పట్ల వేధింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా యువతికి అసభ్యకర మెసేజులు, ఫోటోలు పంపిస్తున్న యువకుడ్నిరాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు తిరువన్నమలైలో ఇంజినీరింగ్‌ చదువుతున్న మాణిక్యం అరుణ్‌ ప్రసాద్‌ వయసు 25 ఏళ్లు. స్థానికంగా నకిలీ ధ్రువపత్రాలతో పలు ప్రీ ఆక్టివేటెడ్‌ సిమ్‌లను సంపాదించాడు. వాటిని ఉపయోగించి నగలు, చీరలు అమ్మే విక్రేతగా ఓ వాట్సాప్‌ గ్రూపు సృష్టించి మహిళల ఫోన్‌నంబర్లు సేకరించాడు. ఇలా నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ యువతి నంబరును సంపాదించి.. ఆమెతో చాట్ చేయడం ప్రారంభించాడు. అయితే ఆమెకు అసభ్యకరమైన మెసేజులు, ఫోటోలు పంపించడం ప్రారంభించార

నిందితుడు మాణిక్యం (ఫైల్ ఫోటో)

వాట్సాప్‌లో పెట్టిన ఆమె ఫోటోను అభ్యంతరకరంగా ప్రదర్శించాడు. లైంగికంగా ఆమెను వేధించాడు. దీంతో బాధితురాలి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలను సేకరించి.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్దనున్న సదరు నిందితుడిని మంగళవారం అరెస్టుచేసి రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా సైబర్‌క్రైమ్‌ ఏసీపీ హరినాథ్‌ మాట్లాడుతూ... యువతులు, బాలికలు వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ పర్సనల్ ఫోటోు చిత్రాలు, సమాచారాన్ని ఉంచవద్దని తెలిపారు.
First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు