పూజ హెగ్డే కు షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు.. వివేక్ ఒబెరాయ్‌‌కు నోటీసులు జారీ..

QNET Scam: షారుక్, అనిల్ కపూర్, బొమన్ ఇరానీ తమ లీగల్ అడ్వకేట్ ద్వారా సమాధానం ఇచ్చారు. పూజ హెగ్డే, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 2, 2019, 2:37 PM IST
పూజ హెగ్డే కు షాక్ ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు.. వివేక్ ఒబెరాయ్‌‌కు నోటీసులు జారీ..
పూజ హెగ్డే
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 2, 2019, 2:37 PM IST
క్యూనెట్ కుంభకోణ రోజుకో మలుపు తిరుగుతోంది. దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందిని మోసం చేసిన సంస్థ.. ఐటీ కారిడార్లైన ముంబై, బెంగళూర్, నోయిడా, అహ్మదాబాద్ లాంటి అనేక నగరాల్లో కోట్లు వసూలు చేసింది. యువత, ఉద్యోగులే టార్గెట్‌గా వారి వద్ద దాదాపు రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. క్యూ నెట్ బాధితులు దేశ వ్యాప్తంగా ఉన్నారు. ఆ సంస్థ చేసిన మోసంతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. చైన్ మార్కెటింగ్ పేరుతో లక్షలాది మంది అమాయకులను ఈ సంస్థ మోసం చేసింది. తాజాగా, మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరవింద్ ఇలాగే మోసపోయి రూ.20 లక్షలు పోగొట్టుకున్నాడు. అవి తిరిగివచ్చే దారి కానరాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే, షారూక్ ఖాన్, పూజా హెగ్డే, అల్లు శిరీష్ సహా బాలీవుడ్ తారాగణం ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారు. దీంతో వారికి సైబరాబాద్ పోలీసులు గతంలోనే నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారిలో ఆరుగురు బాలీవుడ్ నటులు స్పందించలేదు. దీంతో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అందులో షారుఖ్ ఖాన్, అనిల్ కపూర్, బొమన్ ఇరానీ, పూజ హెగ్డే, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్ ఉన్నారు.

షారుక్, అనిల్ కపూర్, బొమన్ ఇరానీ తమ లీగల్ అడ్వకేట్ ద్వారా సమాధానం ఇచ్చారు. పూజ హెగ్డే, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్ ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.క్యూ నెట్ కేసులో మొత్తం 500 వందల మందికి నోటీసులు ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...