Home /News /crime /

PUT TORCH IN PRIVATE PART TWO CROOKS ARRESTED IN GOPALGANJ TOLD SURPRISING PVN

OMG : యువకుడి ప్రైవేట్ పార్ట్ లో నుంచి కడుపులోకి టార్చ్ లైట్ తోసిన నిందితులు అరెస్ట్

యువకుడి కడుపులో టార్చ్ లైట్ తోసేశారు

యువకుడి కడుపులో టార్చ్ లైట్ తోసేశారు

Put torch in private part  : బీహార్(Bihar) లోని గోపాల్ గంజ్ లో రెండు రోజుల క్రితం యువకుడి ప్రయివేటు భాగంలో నుంచి 12 అంగుళాల పొడవైన టార్చ్‌ను శరీరంలోకి తోసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ క్షుణ్ణంగా విచారించి ఇద్దరినీ జైలుకు తరలించారు.

ఇంకా చదవండి ...
Put torch in private part  : బీహార్(Bihar) లోని గోపాల్ గంజ్ లో రెండు రోజుల క్రితం యువకుడి ప్రయివేటు భాగంలో నుంచి 12 అంగుళాల పొడవైన టార్చ్‌ను శరీరంలోకి తోసిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ క్షుణ్ణంగా విచారించి ఇద్దరినీ జైలుకు తరలించారు. అరెస్టయిన నిందితులను మంజాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ కొల్హువా గ్రామానికి చెందిన ఉమేశ్వర్ సాహ్ మరియు సోను సాహ్‌లుగా గుర్తించారు. విచారణలో ఇద్దరూ ఘటనకు పాల్పడినట్లు అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు.పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నిరంతరం గాలిస్తున్నట్లు సదర్ ఎస్‌డిపిఓ సంజీవ్ కుమార్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు మంజాగఢ్‌ ఎస్‌హెచ్‌వో విశాల్‌ ఆనంద్‌ నేతృత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.



అసలు విషయం ఏంటంటే
గోపాల్‌గంజ్‌లోని మంఝఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జూన్ 26 రాత్రి ప్రధాన నిందితుడు ఉమేశ్వర్ సాహ్ మేనల్లుడు పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ క్రమంలో నలుగురు యువకులు బాధిత యువకుడి ఇంటికి వెళ్లి పార్టీ ఉందని చెప్పి పిలిచి అతడిని తీసుకెళ్లారు. పార్టీలో, బాధిత యువకుడిని ఖైనీ ఉంటే ఇవ్వాలని నిందితులు అడిగారు. అయితే తన దగ్గర ఖైనీ లేదని బాధిత యువకుడు చెప్పగా మద్యం మత్తులో ఉన్న నిందితులు డ్యాన్స్ చేయాలని బాధిత యువకుడిని బలవంతపెట్టారు. అయితే డ్యాన్స్ చేసేందుకు బాధిత యువకుడు నిరాకరించాడని నలుగరు నిందితులు కలిసి దారుణానికి ఒడిగట్టారు. . యువకుడిని దారుణంగా కొట్టి ఆ తర్వాత అతడి ప్రైవేట్ పార్ట్ లో నుంచి కడుపులోకి 12 అంగుళాల పెద్ద టర్చ్ ని తోసి రాక్షసానందం పొందారు. పోలీసులకు విషయం చెబితే చంపేస్తామని కూడా ఆ యువకుడిని బెదిరించారు. వెంటనే కుటుంబసభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ లో తనకు జరిగిన ఘోరాన్ని వివరించాడు యువకుడు.



Marriage : కోడలికి మరొకరితో పెళ్లి చేసిన అత్తమామలు..కాళ్లు కడిగి కన్యాదానం..ఎందుకో తెలుసా

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు ఆపరేషన్ కోసం యువకుడిని గోరఖ్‌పూర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కుటుంబం మాత్రం ఓ ప్రైవేట్ క్లినిక్‌లో అీతడికి ఆపరేషన్ చేయించీరు. సోమవారం రాత్రి యువకుడి కడుపులో ఉన్న టార్చ్‌ను డాక్టర్లు ఆపరేషన్‌ చేసి తొలగించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు సూచించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar, Crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు