అది ఉత్తరప్రదేశ్... ఫిరోజాబాద్. NRC చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. వాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శాంతియుతంగా ఆందోళనలు చెయ్యాలని పోలీసులు కోరుతున్నారు. చట్టాన్ని రద్దు చెయ్యాల్సిందే అంటూ ఆందోళనకారులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో... ఏదో వచ్చి... విజేందర్ అనే కానిస్టేబుల్ షర్ట్‌కి ఎడమవైపు ఉండే జేబుకి గట్టిగా తగిలింది. ఎవరైనా కర్రతో కొట్టారేమో అనుకున్నాడు. జేబు వైపు చూశాడు. జేబుకి కన్నం పడినట్లు కనిపించింది. ఆ షర్ట్ జేబు లోంచీ పర్సును బయటకు తీశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే... ఆ పర్సులో ఓ బుల్లెట్ ఉంది. ఎవరో ఆందోళనకారుల గుంపులోంచీ గన్‌తో పేల్చితే... బుల్లెట్ దూసుకొచ్చి... ఆ కానిస్టేబుల్ షర్ట్ ఎడమ పై జేబును చీల్చుకుంటూ... వెళ్లి... పర్సులోపలికి వెళ్లి అక్కడ ఆగిపోయింది. ఆ పర్సులో ఏటీఎం కార్డులు, శివుడి ఫొటో ఉన్నాయి. అవి ఆ బుల్లెట్ వేగాన్ని ఆపి, దాన్ని బాడీలోకి (గుండె లోకి) వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాయి. అంటే ఎవరో పక్కగా షూటింగ్ వచ్చినవాళ్లే ఈ ఫైరింగ్ జరిపారని మనం అంచనాకి రావచ్చు.
ఇంతకీ పర్సును ఎవరైనా ప్యాంట్స్ వెనక చేబులో పెట్టుకుంటారు కదా. మరి ఆ కానిస్టేబుల్ పై జేబులో ఎందుకు పెట్టుకున్నారన్న డౌట్ వచ్చే ఉంటుంది. ఏంటంటే... అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి కదా. ఎవరైనా పర్సును దొంగిలిస్తారేమోనని ముందు జాగ్రత్తగా షర్ట్ పై జేబులో పెట్టుకున్నాడు. అది ఏకంగా అతని ప్రాణాల్నే కాపాడేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, India news, National News, News online, News today, News updates, Telugu news, Telugu varthalu