హోమ్ /వార్తలు /క్రైమ్ /

Firing: కాల్పుల కలకలం.. ఫేమస్ సింగర్ ను కాల్చి చంపిన దుండగులు..

Firing: కాల్పుల కలకలం.. ఫేమస్ సింగర్ ను కాల్చి చంపిన దుండగులు..

సిద్దూ మూస్ వాలా (ఫైల్)

సిద్దూ మూస్ వాలా (ఫైల్)

Punjab: పంజాబ్ ఫేమస్ గాయకుడు సిద్దూ మూసే వాలా ఆదివారం తన గ్రామంలో విగత జీవిగా మారారు. గుర్తుతెలియని దుండగులు ఆయనను కాల్చి చంపారు.

పంజాబ్ లోని  (Punjab) మాన్సా జిల్లాలో కాల్పుల మోతతో దద్దరిల్లింది. జవహర్కే గ్రామంలో ఆదివారం గుర్తుతెలియని దుండగులు సిద్దూ మూసే వాలాను (Sidhu Moose Wala)  కాల్చిచంపారు. సంఘటన స్థలంలోనే ఆయన రక్తపుమడుగులో కుప్పకూలి పడిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఆయన ఫేమస్ సింగర్ (Punjabi singer) . కాగా, పంజాబ్ పోలీసులు మూసే వాలాతో పాటు 424 మందికి ఇటీవల భద్రత సిబ్బందిని ఉపసంహరించుకున్నారు. మూసే వాలా కూడా వారిలో ఉన్నారు. అయితే, సెక్యురిటీని ఉపసంహరించుకున్నా ఒక రోజు తర్వాత.. ఈ ఘటన జరగటం ప్రస్తుతం వివాదస్పదంగా మారింది.

మూసే వాల్ గత అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections)  కాంగ్రెస్ నుంచి మాన్సా స్థానం నుంచి బరిలోకి దిగారు. ఆయన, ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో 63,000 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. అవినీతి ఆరోపణలపై విజయ్ సింగ్లాను ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తొలగించారు. గత నెలలో, సిద్ధూ మూసే వాలా తన తాజా పాట 'బలిపశువు'లో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని రచ్చ రచ్చ చేశాడు. గాయకుడు తన పాటలో AAP మద్దతుదారులను 'గద్దర్' (ద్రోహి) అని అభివర్ణించాడు.

సిద్ధూ మూసేవాలా ఎవరు?

శుభదీప్ సింగ్ సిద్ధూ అకా సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala)  జూన్ 17, 1993న జన్మించిరు. ఆయన మాన్సా జిల్లాలోని మూసే వాలా గ్రామానికి చెందినవాడు. మూసే వాలాకు మిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్నారు. అతని ర్యాప్‌కు ప్రసిద్ధి చెందింది. మూస్ వాలా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. కాలేజీ రోజుల్లో సంగీతం నేర్చుకున్న అతను ఆ తర్వాత కెనడాకు వెళ్లాడు. కాగా, మూస్ వాలా అత్యంత వివాదాస్పద పంజాబీ గాయకులలో (Punjabi singer) ఒకరిగా కూడా పేరు పొందారు.

తుపాకీ సంస్కృతిని బహిరంగంగా ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టే పాటల్లో గ్యాంగ్‌స్టర్‌లను కీర్తిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో విడుదలైన అతని పాట 'జట్టి జియోనే మోర్ ది బందూక్ వార్గీ', 18వ శతాబ్దానికి చెందిన సిక్కు యోధుడు మై భాగో గురించి వివాదానికి దారితీసింది. ఈ సిక్కు యోధుడిని పేలవంగా చూపించారని ఆరోపించారు. మూసే వాలా తర్వాత క్షమాపణలు చెప్పారు.

First published:

Tags: Congress, Crime news, Gun fire, Punjab, Punjab Assembly Elections 2022

ఉత్తమ కథలు