హోమ్ /వార్తలు /క్రైమ్ /

కొద్ది దూరంలో ఉన్నానంటూ భర్తకు ఫోన్ కాల్.. భోగీలో ఏడుస్తూ కూర్చున్న కూతురు.. అసలేం జరిగిందంటే..

కొద్ది దూరంలో ఉన్నానంటూ భర్తకు ఫోన్ కాల్.. భోగీలో ఏడుస్తూ కూర్చున్న కూతురు.. అసలేం జరిగిందంటే..

విచారణ చేపట్టిన అధికారులు

విచారణ చేపట్టిన అధికారులు

Haryana: కాసేపట్లో స్టేషన్ కు రైలు చేరుతుందని భర్తకు ఫోన్ కాల్ చేసింది. తన కూతురుతో కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ రైల్వే జర్నీ చేస్తోంది. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

మహిళల పట్ల వేధింపుల పర్వం కొనసాగుతునే ఉంది. ప్రతిరోజు మహిళలపై వివక్షతలకు సంబంధించిన ఘటనలు ప్రతిరోజు జరుగుతునే ఉన్నాయి. మహిళలు సింగిల్ గా కన్పిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. బడి, గుడి, బస్టాండ్, ఆఫీస్.. చివరకు పోలీస్ స్టేషన్ లలో కూడా మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. దిశ, నిర్భయ, అభయ, పోక్సో చట్టాలు కూడా కామాంధులు లెక్క చేయడం లేదు. తాజాగా, విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో కూడా మహిళల పట్ట అఘాయిత్యాల రేటు ఎక్కువగా అయిందని సర్వేలు చెబుతున్నాయి. అనేక చోట్ల తెలిసిన వారు కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలు సింగిల్ గా కన్పిస్తే చాలు.. తమ పశువాంఛను తీర్చుకొవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు... హర్యానాలోని (Haryana) ఫతేబాద్ లో దారుణ ఘటన జరిగింది. తోహనా పట్టణంలో మరికొద్ది నిముషాల్లో రైలు చేరనుంది. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. పోలీసుల ప్రకారం.. రోహ్ తక్ లో ఒక మహిళ తన కూతురుతో కలిసి ఉద్యగం చేస్తుంది. ఆమె తోహానాలో ఉంటున్న భర్తదగ్గరకు వెళ్లేందుకు రైలు ఎక్కింది. మరికొన్ని నిముషాల్లో రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుతుందనగా షాకింగ్ ఘటన జరిగింది. ఆ భోగీలో మహిళతన బిడ్డతో కలిసి ఉంది. ఆ తర్వాత.. అక్కడ కొంత మంది దుండగులు ఉన్నారు. వారంతా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను ట్రైన్ నుంచి బైటకు తోసేశారు.

ఈ క్రమంలో నిందితుడు కూడా రైలు నుంచి బయటకు దూకేశాడు. రైలు ప్లాట్ ఫామ్ మీదకు చేరుకోగానే బాధితురాలి భర్త.. తన భార్య పిల్లల కోసం వెతుకుతున్నాడు. కోచ్ లో తన భార్య ఏడుస్తూ కన్పించింది. దీంతో బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తన తండ్రికి తెలిపింది. ఈ క్రమంలో.. అతను కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ గాయపడిన ఒక నిందితుడు సందీప్ (27) ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక పోలీసులను రంగంలోనికి దింపి, విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment on women, Haryana, Railway station

ఉత్తమ కథలు