పబ్‌జీ గేమ్‌కు బాలుడి వ్యసనం.. ఏకంగా రూ.16 లక్షలు..

పబ్‌జీ గేమ్‌కు అలవాటు పడిన ఓ బాలుడు ఏకంగా తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి ఎవ్వరికీ తెలియకుండా రూ.16 లక్షలు ఖర్చు చేశాడు.

news18-telugu
Updated: July 4, 2020, 7:18 AM IST
పబ్‌జీ గేమ్‌కు బాలుడి వ్యసనం.. ఏకంగా రూ.16 లక్షలు..
పబ్‌జీ
  • Share this:
ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని సంబర పడాలో.. అది ఎంతటీ అనర్థాలకు దారి తీస్తుందో తెలుసుకుని బాధపడాలో తెలియని పరిస్థితి. ఇంటర్ నెట్ వినియోగం అధికమైనప్పటీ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. అందులో భాగంగానే పిల్లలు, యువత ఆన్‌లైన్ గేమింగ్‌కు వ్యసనపరులవుతున్నారు. ఆన్‌లైన్ గేమింగ్‌లోనూ పబ్‌జీ గేమ్‌కు ఇటు పిల్లలు.. అటు యువతలో క్రేజ్ ఎక్కువ. అయితే ఈ క్రమంలో పబ్‌జీ గేమ్‌కు అలవాటు పడిన ఓ బాలుడు ఏకంగా తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి ఎవ్వరికీ తెలియకుండా రూ.16 లక్షలు ఖర్చు చేశాడు. ఈ ఘటన పంజాబ్‌లో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ 17 సంవత్సరాల బాలుడు పబ్‌జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు. బాలుడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి.

కాగా ఉద్యోగరీత్యా తండ్రి వేరే ప్రాంతంలో ఉంటుండగా, బాలుడు తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే ఆ బాలుడు ఆన్‌లైన్ పబ్‌జీ గేమ్ ఉచ్చులో పడి పబ్‌జీ మొబైల్ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు రూ.16 లక్షలు ఖర్చు చేశాడు. తన తండ్రి మూడు బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.16 లక్షలను ఇందుకు వాడుకున్నాడు. తన టీమ్ సభ్యులతో కలిసి ఇన్‌యాప్ కొనుగోళ్ల కోసం రూ.16 లక్షలను వెచ్చించాడు. అయితే బాలుడి తండ్రి బ్యాంకు స్టేట్‌మెంట్లు చూసేంతవరకు ఎవ్వరికీ విషయం తెలియలేకపోవడం గమనార్హం.
Published by: Narsimha Badhini
First published: July 4, 2020, 7:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading