PUNJAB TEEN MARRIES A SECOND TIME WHO MOVES TO THE HIGH COURT SEEKING PROTECTION OF LIFE FROM PARENTS GH SRD
Teen Marriage : రెండోసారి పెళ్లి చేసుకున్న 16 ఏళ్ల బాలిక..రక్షణ కోసం కోర్టులో పిటిషన్..కోర్టు ఏం చెప్పిందంటే?
ప్రతీకాత్మక చిత్రం
Teen Marriage : బాలిక వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని గ్రహించి.. ప్రాణ రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరో ట్విస్ట్ ఏంటంటే..
కొంతమంది తీసుకునే నిర్ణయాలతో ప్రేమ పెళ్లికి అర్థం లేకుండా పోతోంది. జీవితం అంటే ఏంటో తెలియని వయసులోనే పెళ్లి చేసుకొని రక్షణ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా పంజాబ్, హర్యానా హైకోర్టులో ఇటువంటి పిటిషన్ ఒకటి దాఖలైంది. 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని గ్రహించి.. ప్రాణ రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనకు ఇది రెండో పెళ్లి అని ఆమె పిటిషన్లో పేర్కోవడం గమనార్హం. బాలిక పిటిషన్‌ను స్వీకరించిన పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా, జస్టిస్ సుధీర్ మిట్టల్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
‘బాలిక వయస్సు 16 సంవత్సరాలు మాత్రమే. మైనార్టీ తీరకుండానే పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధం. బాల్యవివాహాల నిషేధ చట్టం, 2006 లోని సెక్షన్ 12 కింద ఈ వివాహం చెల్లదు. పైగా సదరు బాలిక తనది రెండో వివాహం అని పిటిషన్లో పేర్కొంది. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేస్తున్నాం. అప్పటి వరకు సదురు బాలిక, వివాహం చేసుకున్న యువకుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వారిని నారి నికేతన్‌కు తరలించి భద్రతనివ్వాలి. పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలి. ఇరువురి తల్లిదండ్రులు, బంధువులను పిలిపించి వారి సమక్షంలోనే సదరు బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నివేదిక రూపంలో జూలై 23 లేదా అంతకంటే ముందే హైకోర్టుకు అందజేయాలి” అని దర్మాసనం తీర్పునిచ్చింది.
రక్షణ కల్పించాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు..
హైకోర్టు తీర్పు మేరకు హర్యానా ప్రభుత్వం వారిద్దరినీ నారి నికేతన్‌కు తరలించింది. బాలిక తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే, మైనార్టీ తీరకుండానే రెండు సార్లు వివాహం చేసుకున్న సదరు బాలిక పిటిషన్‌పై పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు ఎలాంటి తుది తీర్పునివ్వనుందనేది ఆసక్తికరంగా మారింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.