కుర్రాణ్ని కిడ్నాప్ చేసిన సింగర్... అతని పేరెంట్స్‌కి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే...

Punjab Crime : ఆశయం మాత్రమే కాదు దాన్ని సాధించే మార్గమూ ఉన్నతంగా ఉండాలని మహాత్మాగాంధీ చెప్పారు. రాంగ్ స్టెప్ వేస్తే, జీవితం చీకటే.

Krishna Kumar N | news18-telugu
Updated: April 10, 2019, 1:08 PM IST
కుర్రాణ్ని కిడ్నాప్ చేసిన సింగర్... అతని పేరెంట్స్‌కి ఫోన్ చేసి ఏం చెప్పాడంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎవరైనా కిడ్నాప్ ఎందుకు చేస్తారు... మాగ్జిమం కేసుల్లో డబ్బు కోసమే. ఈ కేసులో కూడా ఆ సింగర్ మనీ కోసమే కిడ్నాప్ చేశాడు. ఐతే... ఆ డబ్బు ఎందుకన్నదే ఈ కేసులో కొత్త విషయం. మేటర్ లోకి వెళ్తే... పంజాబ్‌లోని కురాలీలో ఈమధ్యే పేరు తెచ్చుకుంటున్న పాతికేళ్ల సింగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మైనర్ కుర్రాణ్ని కిడ్నాప్ చేసినందుకు అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని పేరు సాహిల్ వర్మ. హర్యానాలోని సోనిపాట్‌కి చెందిన సింగర్. పంజాబ్ లోని పాప్రాలీ గ్రామంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈమధ్యే పంజాబీ మ్యూజిక్ ఆల్బం అనే ఓ ఆల్బంను తయారుచేయాలనే ఆలోచనకొచ్చాడు. దాన్ని రిలీజ్ చెయ్యాలంటే డబ్బు కావాలి. అందుకోసం బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన మైనర్ కుర్రాణ్ని కిడ్నాప్ చెయ్యాలనుకున్నాడు.

చేసింది నేరమే అయినా... సాహిల్ శర్మ మంచి టాలెంట్ ఉన్నవాడే. మ్యూజిక్ క్లాసులకు వెళ్లి మరీ సంగీతం నేర్చుకున్నాడు. 2016లో ఓ మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాడు. ఓ అద్భుతమైన మ్యూజిక్ ఆల్బం తెచ్చి... దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలనుకున్నాడు. అందుకోసం ముంబైకి మకాం మార్చాలని డిసైడయ్యాడు. చేతిలో చూస్తే డబ్బు లేదు. డబ్బు కోసం కిడ్నాప్ ప్లాన్ వేశాడు. రెండు వారాల కిందట జస్ట్ కారులా కనిపించే పాతకాలపు మారుతీ800ని కొన్నాడు. దాన్ని డ్రైవ్ చేస్తూ... కురాలీలోని స్టేడియం దగ్గరకు వెళ్లాడు.


కురాలీలో ఓ మైనర్ కుర్రాడు (ఆశిష్ జ్యోత్ సింగ్) తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ కనిపించాడు. ఆ కుర్రాడి పక్కన కూర్చొని మెల్లగా మాటల్లోకి దించాడు. అలా రెండు మూడు రోజులు మాట్లాడి... దాదాపు ఫ్రెండులా నటించాడు. ఏప్రిల్ 6న ఎండగా ఉంది. ఐస్ క్రీం తినొద్దాం అంటూ మైనర్ కుర్రాణ్ని కారులో తీసుకెళ్లాడు.

ఆ ఆశిష్‌ను... లూథియానాలోని ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. ఆ రాత్రి ఇద్దరూ అక్కడే పడుకున్నారు. ఆ టైంలో కుర్రాడి తల్లిదండ్రులకు సీక్రెట్‌గా కాల్ చేసిన వర్మ... కుర్రాణ్ని రిలీజ్ చెయ్యాలంటే రూ.2 లక్షలు కావాలన్నాడు. ఆ తెల్లారి... ఆ హోటల్ వైపు పోలీసులు రావడం చూశాడు. అంతే... చకచకా కారెక్కి... చెక్కేశాడు. మైనర్ కుర్రాణ్ని రక్షించిన పోలీసులు... వర్మ మొబైల్ ఫోన్‌ను ట్రాక్ చేశారు. రెండ్రోజుల్లో అతన్ని పట్టుకోగలిగారు.

ఏదో చెయ్యాలనే ఆశయం పెట్టుకొని, ఇంకేదో చేసి... జీవితాన్ని నాశనం చేసుకున్నాడు వర్మ. ఏ ప్రదర్శనలో ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించుకొని, అప్పుడు ముంబై వెళ్లివుంటే... అతని కెరీర్ మరోలా ఉండేదే.

ఇవి కూడా చదవండి :

అయ్యబాబోయ్... రూ.2,00,00,000... లారీలో సిమెంట్ బస్తాల్లో దాచి... ఏలూరుకు...కావేరీ ట్రావెల్స్ ఎందుకలా చేసింది... జనం ఓట్లు వెయ్యకుండా కుట్ర జరుగుతోందా

ఐసీసీ వరల్డ్ కప్ టీమ్స్ ఎప్పుడు ప్రకటిస్తారు... టైమ్ లైన్ ఇదిగో...

ఇంటర్నెట్ ఓటింగ్ తెచ్చేదెప్పుడు... ఎంతసేపూ పాత పద్ధతేనా... మనోళ్లు మారరా...
First published: April 10, 2019, 11:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading