హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రియుడిని సాంతం నాకేసిన ప్రియురాలు.. అది కావాలని అడగ్గానే.. ఎంత పనిచేసింది..

ప్రియుడిని సాంతం నాకేసిన ప్రియురాలు.. అది కావాలని అడగ్గానే.. ఎంత పనిచేసింది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Punjab: యువకుడికి ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పింది. పెళ్లి చేసుకుందామంటూ అతని నుంచి అందిన కాడికి డబ్బులు పంపించుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

కొందరు పవిత్రమైన ప్రేమను కూడా తమ అవసరాల కోసం వాడేసుకుంటున్నారు. ప్రేమ ముసుగులో అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. డబ్బుల కోసం, తమ అవసరాల కోసం ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారు. తీరా అవసరాలు తీరిపోయాక.. ముఖం చాటేస్తున్నారు. మరికొందరు ఒకరికి తెలియకుండా మరికొందరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. ఇంకొందరైతే.. లవర్ లను మెయింటెన్ చేయడం కూడా ఓక స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు.

కొందరైతే.. తప్పులు చేస్తు అడ్డంగా దొరికిపోతున్నారు. ఏంటని వాళ్లని..  మనసారా ఇష్టపడిన వారు ప్రశ్నించగా.. ఎలాంటి పనిచేయడానికైన తెగించేస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో నిజాయితీగా ప్రేమించిన వారు మోసపోతున్నారు. మరికొందరు తమ జీవితాలను మధ్యలోనే ముగించేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. పంజాబ్ లోని (Punjab) లుథీయానాలో విషాదకర సంఘటన వెలుగులోనికి వచ్చింది. లూథియానా జిల్లాలో గురుదీప్ సింగ్ (30) అనే వ్యక్తి కొన్ని నెలలుగా దుబాయ్ లో ఉంటున్నాడు. అతను గతంలో ఇంటికి వచ్చినప్పుడు రన్వాన్ గ్రామానికి చెందిన రాజ్ విందర్ కౌర్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. గురుదీప్ సింగ్ యువతికి, తరచుగా గిఫ్ట్ లు, డబ్బులు పంపిస్తుండేవాడు. ఇవన్ని యువతి మీద ఇష్టంతో పంపుతుండేవాడు. ఇద్దరు కూడా తరచుగా ఫోన్ లో మాట్లాడుకునే వారు. అయితే.. రాజ్ విందర్ కౌర్ దుబాయ్ నుంచి పంజాబ్ వచ్చాడు. వచ్చి రాగానే.. తన ప్రియురాలి దగ్గరకు వెళ్లి పెళ్లి ప్రస్తావించాడు.

దీంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. తనకు అలాంటి ఫీలింగ్ లేదని తెగేసి చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన అతను తన ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలని కోరాడు.దీంతో యువతి అతడిని ఇంట్లో నుంచి చెప్పుతో కొట్టి బైటకు నెట్టేసింది. ఆతర్వాత ఎప్పుడు రావద్దని తెల్చిచెప్పింది. దీంతో తాను.. మోసపోయానని మనస్తాపం చెందిన రాజ్ విందర్ కౌర్ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొడుకు ఎంత సేపటికి గదిలో నుంచి బైటకు రాకపోవడంతో తల్లి వెళ్లి చూసింది. అతను కిటికి నుంచి వేలాడుతూ కన్పించాడు. వెంటనే తండ్రి.. నచ్చతర్ సింగ్.. స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Punjab

ఉత్తమ కథలు