Home /News /crime /

PUNJAB LUDHIANA PREGNANT WOMEN SAYS HUSBAND DOES NOT EARN MUCH THAT IS WHY SHE THEFT GOLD MKS

భర్త ఇచ్చేది చాలడం లేదని.. టీనేజ్ తమ్ముడితో కలిసి పాడు పని -గర్భవతి కావడంతో ఆమెను..

నిందితురాలు రజనీ శర్మ

నిందితురాలు రజనీ శర్మ

Rajni Sharma : పాడు పని చేశానని ఒప్పుకుంటూనే అలా ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ఓ నిందితురాలు కోర్టులో ఇచ్చుకున్న వివరణ సంచలనంగా మారింది. నేరం నాది కాదు పరిస్థితులది అంటూ సినిమాల్లో హీరోలు చెప్పుకున్నట్లు ఈ రియల్ లైఫ్ కిలేడి శిక్ష నుంచి తప్పించుకోవాలని చూసింది. చిన్న పిల్లాడిని వెంటేసుకుని, కడుపులో మరో బిడ్డను మోస్టూ, టీనేజ్ తమ్ముడి సహాయంతో ఆమె చేసిన తప్పుడు పని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

ఇంకా చదవండి ...
టీనేజ్ తమ్ముడు సహాయంగా రాగా, చంటి పిల్లాడిని వెంట పెట్టుకుని నగల దుకాణంలోకి వెళ్లిందా మహిళ. గర్భిణి కావడంతో ఆమెను తొందరగా పంపించేయాలనే ఉద్దేశంతో అడిగిన మోడళ్లన్నీ చకచకా తీసి చూపించాడు షాపువాడు. గంటసేపు చూసినా ఏ ఒక్కటీ నచ్చలేదని చెప్పి వెళ్లిపోయిందామె. తర్వాతి రోజుగానీ నగల లెక్కల్లో తేడాను గమనించిన దుకాణందారు.. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేసుకోగా.. సదరు మహిళ ఏకంగా నాలుగు గోల్డ్ చైన్లను దొంగతనం చేసినట్లు తేలింది. నాలుగు రోజులు వేటాడిని పోలీసులు చివరికి ఆమెను, సహనిందితుడైన తమ్ముణ్ని పట్టుకున్నారు. అయితే, ఈ కేసు కోర్టు ముందుకురాగా, విచారణలో నిందితురాలు చెప్పిన మాటలు కలకలం రేపాయి. నిందితురాలు గర్భిణి కావడంతో ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జడ్జి ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు..

పంజాబ్ లోని లూథియానా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రజనీ శర్మ అనే 24ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఫతేగఢ్ సాహిబ్ లో నివసిస్తోంది. ఆ జంటకు ఇప్పటికే నాలుగేళ్ల బాబు ఉండగా, ఆమె మరోసారి గర్భందాల్చింది. వాళ్లకు సహాయంగా రజనీ తమ్ముడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. మొన్న అక్టోబర్ 9న లూథియానా సిటీకి వచ్చిన రజనీ శర్మ.. ఓ జువెలరీ షాపులో దొంగతనానికి పాల్పడింది. సీసీటీవీ రికార్డుల ఆధారంగా ఫిర్యాదు చేయగా, నాలుగు రోజులు గాలించి ఆమెను పట్టుకున్నారు పోలీసులు.

చంటి పిల్లాడిని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని రజనీ దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు, ఆమె నుంచి రికవరీ చేసిన నగలను సాక్ష్యాలుగా నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కాగా, తన భర్త రోజు కూలీ అని, అతను తెచ్చిచ్చే డబ్బులతో ఇల్లు గడవటం లేదని, అనివార్య పరిస్థితుల్లోనే జువెలరీ షాపులో దొంగతనం చేయాల్సి వచ్చిందని నిందితురాలు జడ్జిగారికి వివరించింది. అయితే కోర్టువారు ఈ కథలకు కరిగిపోలేదు. పేదరికాన్ని సాకుగా చెబితే, ఈ దేశంలో నూటికి నలభై మంది పేదలే కదాని ప్రాసిక్యూటర్ వాదించారు. చివరికి ఆమె రిమాండ్ విధించిన కోర్టు.. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రజనీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆమెతోపాటు దొంగతనంలో పాలుపంచుకున్న తమ్ముడిని జువెనైల్ హోంకు తరలించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Pregnant women, Punjab, Punjab news

తదుపరి వార్తలు