హోమ్ /వార్తలు /క్రైమ్ /

భర్తకు 67 ఏళ్లు... భార్యకు 24 ఏళ్లు... హైకోర్టు ఏం చెప్పిందంటే...

భర్తకు 67 ఏళ్లు... భార్యకు 24 ఏళ్లు... హైకోర్టు ఏం చెప్పిందంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గత నెలలో వివాహం చేసుకున్న 67 వ్యక్తి, 24 ఏళ్ల యువతి హైకోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబాల నుంచి బెదిరింపులు మొదలుకావడంతో ఈ జంట పోలీసు భద్రత కోసం న్యాయస్థానం తలుపుతట్టింది.

    పంజాబ్‌లోని 67 ఏళ్ల శంషేర్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల 24 ఏళ్ల నవప్రీత్ కౌర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. గత నెలలో చండీగఢ్‌లోని గురుద్వారాలో వీరి పెళ్లి జరిగింది. వీరిది ప్రేమ వివాహమో కాదో తెలియదు కానీ... వీరి పెళ్లి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. వెంటనే ఇరు కుటుంబాలకు చెందిన వాళ్లు రంగంలోకి దిగారు. ఇరువురికి బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో శంషేర్ సింగ్‌తో పాటు నవప్రీత్ కౌర్ తమకు భద్రత కల్పించాలంటూ పంజాబ్ చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించారు.


    వీరిద్దరి పెళ్లి సాధారణమైన వివాహం కాకపోయినప్పటికీ... ఈ పెళ్లి వారిద్దరికీ అంగీకారమే అని లాయర్లు కోర్టుకు తెలిపారు. వీరికి ప్రాణహాని ఉండటంతో పోలీసు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు... ఆ దంపతులిద్దరికీ పోలీసు భద్రత కల్పించింది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు సైతం ధృవీకరించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అటు శంషేర్ సింగ్ కానీ, ఇటు నవప్రీత్ కౌర్ కానీ మాట్లాడకపోవడం గమనార్హం.

    First published:

    Tags: High Court, Punjab

    ఉత్తమ కథలు