HOME »NEWS »CRIME »punjab dalit labourer dies after forced to drink urine acid poured on his legs ba

భవన నిర్మాణ కార్మికుడిపై దారుణం.. కాళ్లపై యాసిడ్ పోసి... మూత్రం తాగించి..

భవన నిర్మాణ కార్మికుడిపై దారుణం.. కాళ్లపై యాసిడ్ పోసి... మూత్రం తాగించి..
ప్రతీకాత్మక చిత్రం

పంజాబ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళిత కార్మికుడిని బీభత్సంగా కొట్టిందే కాకుండా అతడితో బలవంతంగా మూత్రం తాగించి.. యాసిడ్ పోసి తీవ్రంగా హింసించారు.

  • Share this:
    పంజాబ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళిత కార్మికుడిని బీభత్సంగా కొట్టిందే కాకుండా అతడితో బలవంతంగా మూత్రం తాగించి.. యాసిడ్ పోసి తీవ్రంగా హింసించారు. బాధితుడు పంజాబ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. భవన నిర్మాణ కార్మికుడైన 37 ఏళ్ల వ్యక్తి మీద జరిగిన ఈ దారుణాన్ని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో దళితుల మీద అఘాయిత్యాలు పదే పదే జరుగుతున్నాయని, తాజాగా జగ్‌మెయిల్ సింగ్ మీద జరిగిన అమానవీయ దాడే అందుకు నిదర్శనమని బాదల్ ఆరోపించారు.

    ‘జగ్‌మెయిల్‌తో అత్యంత దారుణంగా వ్యవహరించారు. అతడిని పిల్లర్‌కు కట్టేసి కొట్టారు. అతడి కాళ్ల మీద యాసిడ్ పోశారు. నీళ్లు కావాలని అడిగితే, అతడిచేత బలవంతంగా మూత్రం తాగించారు. అత్యంత దారుణంగా అతడిని చంపేశారు.’ అని బాదల్ ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఇంత దారుణ ఘటన జరిగితే అధికారులు నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స విషయంలో కూడా ఆలస్యం చేశారని అనుమానం వ్యక్తం చేశారు.



    ఇది కూడా చూడండి :
    Published by:Ashok Kumar Bonepalli
    First published:November 16, 2019, 19:31 IST