కొందరు పోలీసులు ప్రజల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలను కాపాడాల్సిన వారే.. జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్ని చోట్ల ఫిర్యాదులు చేయడానికి పోలీస్ స్టేషన్ లకు వచ్చిన మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. తమ కోరిక తీర్చుకుంటే.. కేసుల్లో ఇరికిస్తామంటూ.. బెదిరిస్తున్నారు. మరికొన్ని చోట్ల పోలీసులే.. స్టేషన్ లో మహిళలను అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి. ఇప్పుడు మరోక పోలీసు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది.
పూర్తి వివరాలు.. పంజాబ్ లో (Punjab) దారుణ ఘటన జరిగింది. హితేష్ కుమార్ (24) తన భార్యతో కలిసి బైటకు వెళ్లాడు. ఆ తర్వాత.. ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు పోలీసులు (Police harassment) వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వీరిని పోలీసులు గమనించారు. బైక్ ను ఆపారు. పత్రాలను చూపించాలని కోరారు. హితేష్ పత్రాలు చూపిస్తుండగానే.. ఎస్ ఐ వీరి పట్ల అసభ్యంగా మాట్లాడారు. ఆ తర్వాత.. వాగ్వాదానికి దిగాడు. దీంతో మహిళ భయపడిపోయి.. తన బంధువులకు ఫోన్ చేసి తెలిపింది.
डेराबस्सी में पंजाब पुलिस ने एक महिला के साथ हाथापाई की और जब उसके पति ने उसका विरोध किया तो उसको गोली मार दी। @ArvindKejriwal के सत्ता में आने के बाद पंजाब पुलिस ने पंजाब नागरिकों को इंसान समझना बंद कर दिया है।इतने पुलिस वाले चाहते तो एक आदमी को पकड़ सकते थे लेकिन गोली मार दी गई pic.twitter.com/8phXweYhel
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) June 27, 2022
దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. సబ్ ఇన్స్ పెక్టర్ బల్వీందర్ సింగ్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా.. తన సర్వీస్ రివాల్వర్ తీసి బంధువులపై కాల్పులు జరిపాడు. దీంతో హితేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. జూన్ 26 రాత్రి జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (video viral) మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా .. పంజాబ్ లోని (Punjab) దారుణమైన ఉదంతం జరిగింది.
జలంధర్ లోని హస్టల్ లో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న హస్టల్ లో (Jalandhar 2 Students) ఇతరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కలిసి ఉంటున్నారు. అయితే, తోటి విద్యార్థి బర్త్ డే వేడుకను సెలబ్రేట్ చేయాలను కున్నారు. అయితే, అప్పుడు కొంత మంది డబ్బులు ఇవ్వడంలో ( Bday Party Contribution) అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో కొంత మంది రెండు వర్గాలుగా విడిపోయారు.
హస్టల్ బంగ్లా మీదకు చేరుకున్నారు. అక్కడ.. బీహర్ కు చెందిన కిషన్ యాదవ్, అమన్ లు.. డిఎవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో కిషన్ యాదవ్ , అమన్ లు కొట్టుకున్నారు. ఇంతలో.. నెట్టుకొవడంతో ఇరువురు బిల్డింగ్ నుంచి కింద పడ్డారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మరణించాడు. మరోక యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.