మా ఆయన నుంచి ప్రియుడికి ముప్పు... కాపాడమంటున్న యువతి.. చివరకు ఏమైందంటే...

మా ఆయన నుంచి ప్రియుడికి ముప్పు... కాపాడమంటున్న యువతి.. చివరకు ఏమైందంటే... (ప్రతీకాత్మక చిత్రం)

జనరల్‌గా ఈ సమాజంలో భార్యభర్తలకు విలువ ఉంటుంది. కానీ ఈ కేసులో సీన్ రివర్స్ అయ్యింది. వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమా అని... ఓ అరుదైన కేసుగా ఇది మారింది. ఇదేంటో తెలుసుకుందాం.

 • Share this:
  ఓ వివాహేతర సంబంధం కేసులో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆ తీర్పును వ్యతిరేకిస్తే... చట్ట ప్రకారం నేరం అవుతుంది కాబట్టి ప్రజలు ఇష్టం లేకపోయినా... ఆ తీర్పును గౌరవిస్తున్నారు. ఈ రోజులే ఇలా తయారయ్యాయి అని వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. అసలేమైందంటే... ఓ భార్య, భర్త... ఫరీద్‌కోట్‌లో చక్కగా కాపురం చేసుకునేవారు. ఐతే... ఓ కుర్రాడు... తరచూ... ఆ ఇంటివైపు వెళ్తూ... ఆమెను అదోలా చూసేవాడు. ఆమె ఇంట్లో ఏ పని చేసుకుంటున్నా... అలాగే చూసేవాడు. ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే... అదోలా చూసేవాడు. ఇలా చూసీ చూసీ మెల్లగా మాటలు కలిపాడు. పెళ్లైన కొత్తలో రోజూ మెచ్చుకునే భర్త... ఇప్పుడు మెచ్చుకోకపోయే సరికి... ఆ మెచ్చుకోళ్లు ఇంకెక్కడైనా దొరికితే బాగుండనుకున్న ఆమె... వాటిని ఆ కుర్రాడిలో వెతుక్కుంది. ఆ కుర్రాడు ఆమె ఏం చేసినా సూపర్, అదుర్స్... మామూలుగా లేదుగా... అంటూ రకరకాలుగా పొగిడేవాడు. అవి ఆమెకు బాగా నచ్చేవి.

  వాళ్ల కాపురంలోకి అతను రావడంతో... కలహాలు మొదలయ్యాయి. అతనితో ఆమె ఎక్కువగా మాట్లాడుతుండటం చూస్తున్న భర్త... ఆమెను కంట్రోల్ చెయ్యాలని చూశాడు. దాంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఏకంగా ఆ కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక గొడవలు మరింత పెరిగాయి. అవి రాన్రానూ ముదిరి... భార్యాభర్తలు జుట్టు పీక్కునేదాకా వెళ్లాయి. అతన్ని చంపేస్తానని బెదిరించాడు భర్త. అంతే... మొగుడి కంటే... ఆ కుర్రాడే మేలు అనుకున్న ఆమె... అతనితో లేచిపోయింది. అంతేకాదు... తమను కాపాడమని కోర్టుకెక్కింది.

  ముందుగా కౌన్సెలింగ్ చేసిన సరన్ష సభర్వాల్... వాళ్లు చెప్పేది విన్నారు. ఆమె భర్తతో... ఆ ఇద్దరికీ డేంజర్ ఉంది అని భావించారు. వాళ్లకు రక్షణ కల్పించాలి అని ఫరీద్‌కోట్ పోలీసుల్ని ఆదేశించాల్సిందిగా... కౌన్సెల్... పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టును కోరింది. కేసులో వాదనలు విన్న హైకోర్టు... వివాహేతర సంబంధం తప్పు కాదు అని సుప్రీంకోర్టు ఒకప్పుడు చెప్పిన తీర్పును లెక్కలోకి తీసుకొని... ఆమెనూ, ఆ కుర్రాణ్నీ... ఆమె భర్త నుంచి కాపాడాల్సిందిగా ఫరీద్‌కోట్ SSPని ఆదేశించింది. ఐతే... ఇలా చెప్పినంత మాత్రాన... తాము వివాహేతర సంబంధాల్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు అని కూడా హైకోర్టు చెప్పింది. వారికి పూర్తి భద్రత కల్పిస్తామన్నారు పోలీసులు.

  ఇది కూడా చదవండి: Rape: 16 ఏళ్ల అమ్మాయిపై 8 ఏళ్లుగా అత్యాచారం... దంపతులు అరెస్టు

  ఈ తీర్పు తెలుసుకొని ప్రజలు... రోజులు ఇలా ఉన్నాయి అనుకుంటున్నారు. అవతల ఆమె భర్త... తన భార్య తనకు దూరమైపోయిందే అని లబోదిబోమంటున్నాడు. ఆవేశంలో చంపేస్తానని అన్న మాటను పట్టుకొని... ఏకంగా కోర్టుకు వెళ్లడమేంటి... తన గతి ఇలా అవ్వడమేంటని తల పట్టుకుంటున్నాడు. "అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా రోజులు మారాయి. భార్యలు ఏం చేసినా పడుంటారులే అనుకోవద్దు. వారి మనసును అర్థం చేసుకొని కాపురం చెయ్యాలి. వారిని ఇబ్బంది పెడితే... ఇలాంటి పరిణామాలే జరుగుతాయి" అంటున్నారు పోలీసులు.
  Published by:Krishna Kumar N
  First published: