హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: డేటింగ్ యాప్ లో పరిచయం.. కక్కుర్తి పడిన యువతి.. మాల్దీవులకు తీసుకెళ్లి..

Shocking: డేటింగ్ యాప్ లో పరిచయం.. కక్కుర్తి పడిన యువతి.. మాల్దీవులకు తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pune: ఆన్ లైన్ డేటింట్ యాప్ లో యువతిని పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత.. ఇద్దరు కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్నారు. యువతికి మాయమాటలు చెప్పి మాల్దీవులకు తీసుకెళ్లాడు.

ప్రస్తుతం ఒక్కరు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ను (Social media)  ఉపయోగిస్తున్నారు. కొందరు దీనితో తమను తాము.. అప్ డేట్ చేసుకుంటుంటే.. మరికొందరు దీన్ని తప్పుడు మార్గానికి ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా ఫేస్ బుక్, ఇన్ స్టాలలో కొంత మంది యువతులు వేధింపులకు గురౌతున్నారు. అవతలి వ్యక్తుల నుంచి రిక్వెస్ట్ లు రాగానే వాటిని యాక్స్ ప్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల సైబర్ నేరగాళ్లు (Cyber fraud) అందమైన అమ్మాయిల ఫోటోలను ప్రొఫైల్ పిక్ లుగా ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. మరికొందరు తాము.. హై ప్రొఫైల్ కల్గి ఉన్నామని, రాజకీయ నాయకులు తెలుసంటూ లేని మాటలు చెప్పి అవతల వారిని మోసగిస్తుంటారు. ఇలాంటి సంఘటన పూణెలో వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. పూణెకు (Pune) చెందిన యువతికి ఆన్ లైన్ డేటింగ్ (Dating app) అప్లికేషన్ యాప్ లో ముఖేష్ సూరవంశీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారి ఒకరిని మరోకరు తరచుగా కలుసుకునే వారు. తాను సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, సమ్మర్ వేకేషన్ కోసం మాల్దీవులకు వెళ్దామని యువతికి ఆఫర్ ఇచ్చాడు. యువతి అతగాడి మనసులో ఉన్న వంకర బుద్ధిని కనిపెట్టలేకపోయింది. దీంతో ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ హోటల్ లో బసచేశారు. ఆ తర్వాత... వీరిద్దరు కలసి అక్కడ తిరిగారు. యువతి, దగ్గర నుంచి ఖర్చుల కోసం యాభై వేలను తీసుకొన్నాడు. ఈ క్రమంలో.. హోటల్ లో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ముద్దులు పెడుతూ, తనతో గడపాలని బలవంతం చేశాడు. దీంతో షాకింగ్ కు గురైన మహిళ వెంటనే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత.. తన స్వగ్రామానికి వెళ్లి జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సమాజంలో కొందరు పోలీసులు (Police) కామాంధులుగా ప్రవర్తిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన మరోసారి వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar pradesh)  కాస్ గంజ్ జిల్లాలో ఈ ఉదంతం జరిగింది. అత్రౌలీ గ్రామంలో 16 ఏళ్ల యువతి తమ బంధువుల ఇంటికి వచ్చింది. దీంతో అక్కడికి పనిమీద వచ్చిన పోలీసు, బాలికపై కన్నేశాడు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి బైక్ మీద ఎక్కించుకున్నాడు. పక్క గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ గదిలో బాలికను అత్యాచారం (Rapes on girl)  చేశాడు. ఆ తర్వాత.. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే దారుణ పరిస్థితులు ఎదుర్కొంటావంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

బాలిక భయంతో తన ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత.. జరిగిన దారుణాన్ని ఇంట్లో వారితో చెప్పింది. ఈ మేరకు కుటుంబసభ్యులు బాలికపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. కాగా, ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బాలికను పరీకల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై సమగ్ర  విచారణ చేపట్టారు.

First published:

Tags: Dating App, Female harassment, Harassment on women, Pune, Rape attempt

ఉత్తమ కథలు