Home /News /crime /

PUNE SCHOOL LETS LOOSE BOUNCERS ON STUDENTS PARENTS OVER FEES DISPUTE PAH

ఇదేం పైత్యం రా అయ్యా... లేడి బౌన్సర్ లను నియమించుకొని మరీ దారుణం.. .. కారణం ఏంటంటే..

దాడికి పాల్పడుతున్న లేడీ బౌన్సర్

దాడికి పాల్పడుతున్న లేడీ బౌన్సర్

Shocking: పాఠశాలలో కట్టిన ఫీజుకి రశీదు ఇమ్మంటే పూణెలోని ఒక స్కూల్ లో.. ప్రిన్సిపల్ అమానుషంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా బౌన్సర్ (Bouncers)లను నియమించి.. వారితో తల్లిదండ్రులపై దాడులను కొట్టించారు. అంతటితో ఆగకుండా..

Shocking: పాఠశాలలో కట్టిన ఫీజుకి రశీదు ఇమ్మంటే పూణెలోని ఒక స్కూల్ లో.. ప్రిన్సిపల్ అమానుషంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా బౌన్సర్ (Bouncers)లను నియమించి.. వారితో తల్లిదండ్రులపై దాడులను కొట్టించారు. అంతటితో ఆగకుండా..

Pune school  dispute: పూణెలోని ఒక పాఠశాలలో దారుణం జరిగింది. స్యూల్ యజామాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. పూణాలో క్లైన్ మెమోరియల్ స్కూల్ అనే పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో తమ కొడుకు కోసం వారి మంగేష్ గైక్వాడ్ అనే వ్యక్తి పాఠశాలలో ఫీజులు చెల్లించారు.

ఆ తర్వాత.. స్కూల్ యజామాన్యం రశీదు తర్వాత ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థి పేరెంట్స్ రశీదుకోసం (Fees Receipt) పాఠశాలకు వచ్చారు. అప్పుడు ప్రిన్సిపల్, యాజమాన్యంతో , రశీదు విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. రశీదు ఇవ్వడానికి (Pune School Fee dispute)  ప్రిన్సిపల్ ఒప్పుకోలేదు. దీంతో వీరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇది చివరికి దాడులు చేయడం వరకు, బౌన్సర్ లను నియమించుకొవడం వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ సంఘటన పూణాలో కలకలంగా మారింది.

మనం సాధారణంగా సెలబ్రిటీలు, పెద్ద హోటల్స్ , వీఐపీలు, రాజకీయ నాయకులు తమ భద్రత కోసం బౌన్సర్ లను నియమించుకోంటారనే విషయం మనకు తెలిసిందే. ఒక్కొసారి ఏదైన పార్టీలు,స్టేజ్ షోల సమయంలో అల్లరిమూకలను అదుపు చేయడానికి ప్రత్యేకంగా బౌన్సర్ (Bouncers) లను నియమించుకుంటారు. అయితే, కొంత మంది రియల్ ఎస్టేట్ మాఫియాలు కూడా వీరిని నియమించుకొని ఎదుటి వారిని భయపేట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం పూణాలో జరిగింది.

పూర్తి వివరాలు.. పూణెలోని (Pune School Fees Dispute) క్లైన్ మెమోరియల్ స్కూల్ లో చెల్లించిన ఫీజుకి రశీదు ఇమ్మంటే యాజమాన్యం ఇవ్వనని మోండికేసింది. అంతటితో ఆగకుండా కొంత మంది లేడి బౌన్సర్ లను నియమించుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులపై (Bouncers Attack On Family) దాడి చేయించారు. రశీదు అడగటానికి వెళ్లిన తల్లిదండ్రులపై పిడిగుద్దులతో దాడిచేశారు.

అంతటితో ఆగకుండా వారిని బయటకు నెట్టివేశారు. దీంతో బాధితుడు.. మంగేష్ గైక్వాడ్ స్థానిక బిబ్వేవాడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పాఠశాల యజమాన్యంపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ (Viral News)గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Maharashtra, Pune news, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు