బర్గర్ తిని రక్తం కక్కుకొన్నాడు... ఆ తర్వాత...

సజీత్ మాత్రం బర్గర్ తిని విలవిలలాడాడు. అతని నోటి నుంచి రక్తం రావడం ప్రారంభించింది. గొంతు నొప్పంటూ కేకలు పెట్టాడు. చుట్టూ ఉన్న అతని స్నేహితుల్ని అతడికి ఏం జరిగందోనని హడలిపోయారు.

news18-telugu
Updated: May 21, 2019, 4:06 PM IST
బర్గర్ తిని రక్తం కక్కుకొన్నాడు... ఆ తర్వాత...
సజీత్ మాత్రం బర్గర్ తిని విలవిలలాడాడు. అతని నోటి నుంచి రక్తం రావడం ప్రారంభించింది. గొంతు నొప్పంటూ కేకలు పెట్టాడు. చుట్టూ ఉన్న అతని స్నేహితుల్ని అతడికి ఏం జరిగందోనని హడలిపోయారు.
  • Share this:
బర్గర్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు. టైంకు అన్నం తినని వాళ్లు కూడా .... బేకరీలకు వెళ్లి ఇష్టంగా బర్గర్‌లు లాగించేస్తుంటారు. అలానే ఓ వ్యక్తి ఎంతో ఇష్టంగా తిన్న బర్గర్ అతనికి లేనిపోని తంటాలు తెచ్చిపెట్టింది. ఓ వ్యక్తి బర్గర్ తిని రక్తం కక్కుకున్న ఘటన పూణేలో చోటు చేసుకుంది. సజిత పటాన్.. వయసు 31 ఏళ్లు. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా బయటకు వెళ్లాడు. ఆకలి వేయయడంతో దగ్గర్లో ఉన్న బర్గర్ కింగ్ అవుట్ లెట్‌కి వెళ్లారు. అంతా బర్గర్, ఫ్రెండ్ ఫ్రైస్, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేశారు. అవన్నీ వాళ్ల టేబుల్‌పైకి వచ్చి వాలాయి. ఇంకేముంది ఫుడ్ రాగానే అంతా తినడం ప్రారంభించారు. అంతా ఆనందంగా బర్గర్ టేస్ట్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇంతలో సజీత్ మాత్రం బర్గర్ తిని విలవిలలాడాడు. అతని నోటి నుంచి రక్తం రావడం ప్రారంభించింది. గొంతు నొప్పంటూ కేకలు పెట్టాడు. చుట్టూ ఉన్న అతని స్నేహితుల్ని అతడికి ఏం జరిగందోనని హడలిపోయారు. అతడ్ని సముదాయిస్తూనే... సుజిత్ తిన్న బర్గర్‌ను పరిశీలించారు.

ఆ బర్గర్‌ను చూసి షాక్ తిన్నాడు. ఎందుకంటే... సుజిత్ తిన్న బర్గర్‌లో పగిలిని గాజు గ్లాసు ముక్కలు కనిపించాయి. అవి గుచ్చుకోవడంతోనే.. సుజిత్ నోటింట రక్తం వచ్చిందని గ్రహించారు. వెంటనే అతడ్ని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే ఆ సమయంలో సుజీత్ వాంతులు కూడా చేసుకున్నట్లు అతడి స్నేహితులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బర్గర్ షాపు యాజమాన్యం వెంటనే ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం సజీత్‌కు రూ. 15 వేలు చెల్లించింది. మరుసటి రోజు దానికి డుబుల్ డబ్బులు ఇచ్చి.. ఈ విషయం బయటకు చెప్పవద్దని కోరింది. ప్రస్తుతం సజీత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు డాక్టర్లు. కానీ ఈ న్యూస్ కాస్త వైరల్ అవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెడికల్‌ రిపోర్ట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. అవి రాగానే బర్గర్‌ కింగ్‌ ఔట్‌లెట్‌ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...