PUNE MAN SET HIS LADY BOSS ON FIRE AFTER SHE REMOVED HIM FROM JOB HERE IS CHOCKING CRIME STORY SK
అతడిని ఉద్యోగం నుంచి తొలగించడమే ఆమె చేసిన పాపం.. చివరకు రెండు ప్రాణాలు బలి
ప్రతీకాత్మక చిత్రం
జాబ్ తీసేయడంతో కుట్టు దుకాణం యజమానిపై మిలిండ్నాథ్ కోపం పెంచుకున్నాడు. ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం పక్కా ప్లాన్‌తో ఆమెపై దాడి చేశాడు.
ఆఫీసులో అతడి పని తగ్గింది. చెప్పినట్టు వినడం లేదు. ప్రవర్తన కూడా బాగాలేదు. రూల్స్ అతిక్రమించి వ్యవహరిస్తున్నాడు. అంతే బాస్‌కు చిర్రెత్తికొచ్చింది. అతడి తీరు నచ్చలేదు. ఇలాంటి వాడు తమకు అవసరం లేదని.. ఉద్యోగం నుంచి తొలగించింది. ఇలా చేయడమే ఆమె కొంపముంచింది. తనను ఉద్యోగం నుంచి తొలగించిందన్న కోపంతో అతడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై పెట్రోల్ పోసి.. నిప్పటించాడు. ఈ క్రమంలో అతడికి కూడా మంటలంటుకున్నాయి. తీవ్ర గాయాలతో చివరకు ఇద్దరూ మరణించారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చేసుకుంది.
పుణెకు చెందిన మిలింద్నాథ్ సాగర్ అనే 35 ఏళ్ల వ్యక్తి ఓ కుట్టు దుకాణంలో పనిచేసేవాడు. ఐతే అతడి పని తీరు, ప్రవర్తన నచ్చని మహిళా యజమాని.. మిలింద్నాథ్ను ఉద్యోగం నుంచి తొలగించింది. అతడిని జాబ్ నుంచి తొలగించి.. ఎనిమిది రోజులయింది. తన జాబ్ తీసేయడంతో కుట్టు దుకాణం యజమానిపై మిలిండ్నాథ్ కోపం పెంచుకున్నాడు. ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం పక్కా ప్లాన్‌తో ఆమెపై దాడి చేశాడు. సోమనాథ్ నగర్లో రాత్రి 11 గంటల సమయంలో ఆ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఐతే అతడికి కూడా మంటలంటుకున్నాయి. వారు మంటల్లో కాలిపోతుండం చూసి..పక్కనే మొబైల్ షాప్‌ను నడిపే వ్యక్తి.. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు.
తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మిలింద్ నాథ్ సాగర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 90శాతం కాలిన గాయాలతో అతడు ఆస్పత్రిలో చేరాడు. కానీ మరుసటి రోజే అతడు కూడా మరణించాడు. మహిళలను కాపాడేందుకు ప్రయత్నించిన మొబైల్ షాప్ యజమాని కూడా గాయపడ్డాడు. 35శాతం కాలిన గాయాలతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. స్థానికులను అడిగి వివరాలను తెలుసుకుంటున్నామని చందన్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ జాదవ్ తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.