Man forces wife to sleep with boss : భార్యాభర్తల బంధం(Wife and Husband Relation) గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అవుతుంది. భార్య అంటే భర్తలో సగం. భర్త కష్టసుఖాల్లో ఆమె పాలుపంచుకుంటుంది. భర్త కోసం ఎంత త్యాగానికైనా వెనుకాడదు. పతియే ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు భార్యలు. కానీ, కాలం మారుతున్న కొద్దీ ఆ వివాహ బంధానికి మచ్చ తెచ్చే సంఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. కొంతమంది భర్తలు తమ భార్యలను ఆట వస్తువులుగా చూస్తున్నారు. తమ చేతిలో కీలుబొమ్మలుగా మార్చుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఓ భర్త భార్యను అంగడి సరుకుగా మార్చేశాడు. తనకు ఉద్యోగంలో ప్రమోషన్(Promotion) కోసం బాస్‌తో పడుకోవాలని భార్యను బలవంతం చేశాడు. అంతేకాకుండా అతడి సోదరుడు కూడా పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. టార్చర్ భరించలేకపోయిన ఆ మహిళ చివరకు కోర్టును ఆశ్రయించింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు(Indore) చెందిన ఒక మహిళకు మహారాష్ట్రలోని పూణే(Pune) జిల్లాకు చెందిన అమిత్ ఛబ్రాతో(Amith Chhabra) వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కూతురు ఉంది. పెళ్లైన కొంతకాలం వరకు బాగానే ఉన్న అమిత్..మెల్లిగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వచ్చే జీతం సరిపోకపోవడంతో జీతం పెంచాల్సిందిగా బాస్ ను కోరాడు. అందుకు అతడు నీ భార్యను పంపితే ప్రమోషన్ ఇస్తా అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రమోషన్ కోసం బాస్‌తో పడుకోవాలని భార్యను బలవంతం చేశాడు. బాస్ తో ఒక రాత్రి గడిపితే తనకు ప్రమోషన్ తో పాటు ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయని అమిత్ భార్యను బలవంతం చేశాడు. అయితే ఈ పనికి అంగీకరించకపోవడంతో భార్యను చావబాదాడు. విసిగిపోయిన ఆ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమెపై లైంగిక వేధింపులు తగ్గలేదు. అత్తమామలకు చెపుదామన్నా అది సాధ్యపడలేదు. అత్త భర్త చెప్పినట్లు చేయమని చెప్పేది. మరోవైపు,అమిత్ సోదరుడు కూడా ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడం చేసేవాడు.
క్లాసులో టీనేజర్ కు ప్రేమపాఠాలు.. స్కూల్ విద్యార్థితో ఉడాయించిన టీచర్.. ఎక్కడంటే..
భర్త, అత్తింటి కుటుంబం వేధింపులు భరించలేని ఆ మహిళ గతేడాది ఆగస్టులో ఇండోర్ లోని పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేపింది. భర్త నిర్వాకం మొత్తం పూసగుచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా తన మరిది రాజ్ కూడా తనపై తన కూతురు ఎదుటే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది.దీంతో ఇండోర్ పోలీసులు అమిత్‌ను పిలిపించారు. పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం..ఇకపై తన భార్యను వేధించనంటూ లిఖితపూర్వకంగా అమిత్ హామీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి భర్త ఇంటికి వెళ్లింది. ఇప్పటికీ అమిత్ ప్రవర్తనలో మార్పు రాలేదు. నాలుగైదు రోజులు బాగున్న అమిత్.. మళ్లీ భార్యపై వేధింపులకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఇండోర్ కోర్టును ఆశ్రయించారు. దీంతో మహిళా సంక్షేమ అధికారిణితో దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ మహిళపై వేధింపులు నిజమేనని దర్యాప్తులో తేలింది. దీంతో కోర్టు ఆదేశంతో ఆమె భర్త, అతడి సోదరుడు, అత్తపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Husband harassment, Madhya pradesh, Maharashtra, Pune, Wife