హోమ్ /వార్తలు /క్రైమ్ /

Attack With Axe: పావురాలను బోను నుంచి విడిచిపెట్టినందుకు.. సొంత సోదరుడిపైనే గొడ్డలితో దాడి

Attack With Axe: పావురాలను బోను నుంచి విడిచిపెట్టినందుకు.. సొంత సోదరుడిపైనే గొడ్డలితో దాడి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Attack With Axe: పావురాలను బయటకు పంపిన తరువాత మొదలైన గొడవ పెద్దగా మారింది. దీంతో సిద్ధేశ్వర్ గొడ్డలితో సాగర్‌ తల, వీపు, చేతులు, కాళ్లపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

  • News18
  • Last Updated :

పంజరంలోని పావురాలను విడిచిపెట్టినందుకు సోదరుడిపై గొడ్డలితో దాడి చేశాడు ఒక వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని చిక్లీ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడు తీవ్రమైన గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. జిల్లాలోని బొల్హిమల గ్రామంలో నివసించే 28 ఏళ్ల సాగర్ కాంబ్లేపై ఫిబ్రవరి 5న తన సవతి తల్లి, ఆమె కొడుకు దాడి చేశారు. పావురాలను బోను నుంచి విడుదల చేసిన విషయంలో గొడవ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి సిద్దేశ్వర్ కాంబ్లే అనే వ్యక్తి సాగర్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సాగర్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఫిబ్రవరి 5న సాగర్ తమ్ముడు శ్రీధర్ నిందితుడికి చెందిన పావురాలను బోను నుంచి విడిచిపెట్టాడు. అవి చేస్తున్న అల్లరి వల్ల ఇబ్బంది పడుతున్నామని అతడు చెప్పాడు. అందుకే బోను నుంచి పావురాలను బయటకు వెళ్లగొట్టామని బాధితుడి కుటుంబం చెబుతోంది.

పావురాలను బయటకు పంపిన తరువాత మొదలైన గొడవ పెద్దగా మారింది. దీంతో సిద్ధేశ్వర్ గొడ్డలితో సాగర్‌ తల, వీపు, చేతులు, కాళ్లపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడిన సాగర్‌ను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై చిక్లీ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. బాధితుడి ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గతంలో కూడా పుణె, పింప్రి చించ్వాడ్ ప్రాంతాల్లో ఇలాంటి కేసులు చాలా వెలుగుచూశాయి. ఇక్కడివారు పావురాలను పెంచుతుంటారు. వాటి యజమానుల మధ్య గొడవలకు సంబంధించి ఇక్కడ అనేక కేసులు నమోదయ్యాయి.

గతంలో మరో కేసు..

గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లో కూడా పావురాల విషయంలో జరిగిన గొడవ వార్తల్లో నిలిచింది. చిన్న విషయంలో జరిగిన గొడవ కారణంగా 11 పావురాలను చంపేశాడు ఒక యువకుడు. ధరమ్ పాల్ సింగ్ అనే వ్యక్తి తన ఇంటిపై పావురాలను పెంచుతున్నాడు. అతడికి, సమీపంలో ఉండే రాహుల్ సింగ్ అనే యువకుడికి గొడవ జరిగింది. కరోనా సమయంలో తన ఇంటి ముందు ఉమ్మేస్తున్నాడనే కారణంతో రాహుల్‌ను ధరమ్‌పాల్‌ ఒకసారి మందలించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న రాహుల్.. ధరమ్ పాల్ పావురాలను చంపేశాడు. ఇంటిపై బోనులో ఉన్న పావురాలను రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనలో నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

First published:

Tags: Crime, Crime news, Crime story, Maharashtra, Pune, Pune news

ఉత్తమ కథలు