Home /News /crime /

PUNE ASSISTANT COACH MOLESTS FOUR MINORS AT SCHOOL BOOKED UNDER POCSO CR

స్కూల్ విద్యార్థులతో పీటీ మాస్టర్ నీచమైన పనులు... స్కూల్‌కి వెళ్లిన పోలీసులకు షాక్...

అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ... అసిస్టెంట్ కోచ్ అరెస్ట్...

అమ్మాయిలను అసభ్యంగా తాకుతూ... అసిస్టెంట్ కోచ్ అరెస్ట్...

స్కూల్‌లో అసిస్టెంట్ కోచ్‌‌పై లైంగిక దాడి ఆరోపణలు... విచారణ చేసేందుకు సదరు స్కూల్‌కి వెళ్లిన పోలీసులకు ఫిర్యాదు చేసిన మరికొంత మంది విద్యార్థినీలు... కోచ్ అరెస్ట్...

విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అడ్డదారులు తొక్కుతున్న కాలమిది. తాజాగా మహారాష్ట్రలోని పూణే నగరంలో మరో కీచక టీచర్ వెలుగులోకి వచ్చాడు. పూణే సమీపంలో ఉన్న ఓ స్కూల్‌లో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న ఓ వ్యక్తి, తమపై లైంగికంగా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ చేద్దామని సదరు స్కూల్‌కి వెళ్లిన పోలీసలుకు అక్కడ దిమ్మతిరిగే షాక్ తగిలింది. తమను కూడా లైంగికంగా వేధించాడంటూ మరికొందరు విద్యార్థులను పోలీసులకు విన్నవించుకున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సదరు కోచ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్‌లో పిల్లలకు ఆటల్లో శిక్షణ ఇచ్చే సదరు పీటీ మాస్టార్... ట్రైనింగ్ పేరుతో బాలికలను అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. ఒంటరిగా ఉన్న సమయంలో పైశాచికంగా ప్రవర్తిస్తూ నరకం చూపించేవాడు. దీంతో ఓ తొమ్మిదో తరగతి అమ్మాయి... కోచ్ చేస్తున్న అసభ్య పనుల గురించి తల్లిదండ్రులకు విన్నవించుకుంది.

ఆమె తల్లిదండ్రులు నేరుగా పోలీసులను సంప్రదించి, ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... సదరు స్కూల్‌కి వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విచారణలో మరో ముగ్గురు విద్యార్థినులు... తమతో కూడా ఇలాగే ప్రవర్తించాడంటూ పోలీసులకు విన్నవించుకున్నారు. కోచ్‌పై ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకున్న పోలీసులు... అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు అసిస్టెంట్ కోచ్‌ను తక్షణమే విధుల్లోంచి తొలగిస్తున్నట్టు తెలిపింది స్కూల్ యాజమాన్యం. కోచ్‌పై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదుచేసుకున్న పోలీసులు... ఎంత మంది విద్యార్థులతో ఇలా ప్రవర్తించి ఉంటాడనే విషయమై ఆరా తీస్తున్నారు.


First published:

Tags: Crime, Selfie Deaths

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు