దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి దారుణాలు వెలుగుచూస్తున్నాయి. అయితే మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనల్లో.. చాలా వరకు నిందితులు బాధితులకు తెలిసివారే కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొద్ది రోజుల కిందటే పెళ్లి చేసుకున్న యువతిపై(19) అత్యాచారం జరిపి, హత్య చేశాడు. ఇందుకు అతని స్నేహితుడు కూడా సహకరించాడు. అయితే బాధిత యువతి నిందితుడికి మరదలు (sister-in-law) అవుతుంది. ఆదివారం పూణేలోని ఘోర్వదేశ్వర్ హిల్స్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బాధిత యువతికి కొద్ది రోజుల క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త కజిన్ ఒకరు(ప్రధాన నిందితుడు) వారికి దేహు రోడ్డు ప్రాంతంలో (Dehu Road area) వారు ఉండేందుకు ఓ ఇంటిని చూపించాడు.
అయితే ఆదివారం రోజున నిందితుడు.. తనతో పాటు ఘోర్వదేశ్వర్ హిల్స్ (Ghorwadeshwar Hills) ప్రాంతంలోని ఓ పురాతన ఆలయానికి రావాల్సిందిగా బాధితురాలిని కోరాడు. ఇందుకు ఆమె అంగీకరించడంతో.. వారు ఆలయానికి వెళ్లారు. అయితే నిందితుడితో పాటు అతని స్నేహితుడు కూడా ఆలయం చూసేందుకు వచ్చాడు. అయితే అక్కడ వారు బాధితురాలును తమతో శారీరక సంబంధం పెట్టుకోవాల్సిందిగా బలవంతం చేశారు. అయితే అందుకు యువతి నిరాకరించడంతో నిందితుడు, అతని స్నేహితుడు.. యువతిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత హత్య చేశారు.
ఇక, బయటకు వెళ్లిన బాధిత యువతి ఇంటికి తిరిగి చేరుకోకపోవడంతో ఆమె భర్త ఆందోళన చెందాడు. తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సోమవారం ఘోర్వదేశ్వర్ హిల్స్ పొదల్లో యువతి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు విచారణ జరపగా.. అసలు విషయం వెలుగుచూసింది. ఈ క్రమంలోనే పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అయితే.. అతని స్నేహితుడు మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు.
‘నిందితుడు, అతని స్నేహితుడు యువతిని లైంగిక సంబంధం పెట్టుకోవాలని అడిగారు. అందుకు ఆమె నిరాకరించడంతో..నిందితుడు, అతని స్నేహితుడు అత్యాచారం చేసి, హత్య చేశారు (Rape and Murder). రాయిని ఉపయోగించి బాధితురాలి ముఖాన్ని కూడా పగలగొట్టారు. ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇలా చేశారు. అనంతరం మృతదేహాన్ని కొండపై ఉన్న పొదల్లో పారేశారు’అని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.