(Anna Raghu, News18, Amaravati)
పుల్లారెడ్డి స్వీట్స్.. ఈ పేరు వింటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికే కాదు, ఒక్కసారైనా ఆ మిఠాయిని రుచి చూసినవాళ్లకు ఇట్టే నోరూరుతుంది. జి.పుల్లారెడ్డి స్వచ్ఛమైన నెతి మిఠాయిలు పేరుతో పెద్దాయన నిర్మించిన బడా వ్యాపార సామ్రాజ్యాన్ని ఇప్పుడాయన వారసులు నిర్వహిస్తున్నారు. అయితే స్వీట్ల పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డికి సంబంధించి మాత్రం చేదు విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వీట్ల సామ్రాజ్యానికి వారసుడైన ఏక్నాథ్ రెడ్డి తన భార్యను తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు వచ్చాయి. తనను ఇంట్లోనే బంధించి గోడ కట్టాడంటూ ఏక్నాథ్ రెడ్డిపై ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు తెలిసిన వివరాలివి..
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏక్నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రగ్యారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏక్నాథ్ రెడ్డి.. ఆయన భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా బంధించినట్లు వెలుగులోకి వచ్చింది.
భార్య ప్రగ్యారెడ్డని ఇంట్లోనే బంధించిన ఏక్ నాథ్ రెడ్డి ఆమె బయటికి రాకుండా రాత్రికే రాత్రే రూమ్‌కు అడ్డంగా ఓ గోడను కట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడని వెల్లడైంది. పుట్టింటివారి సాయంతో హెల్ప్ లైన్ 100 కు కాల్ చేసి, ఆ ఇంట్లో నుంచి బయటపడ్డ ప్రగ్యారెడ్డి.. నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్త ఏక్నాథ్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో జీరో ఎఫ్ఐఆర్ విధానం కొనసాగుతుంన్నందున ముందుగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఏక్ నాథ్ రెడ్డిపై గృహహింస, వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఏక్ నాథ్ రెడ్డి ఎక్కడున్నదీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Plants in Moon Soil: చంద్రుడి మీది మట్టిలో మొక్కలు.. అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతం.. ఇక వ్యవసాయం
ఏక్నాథ్ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి G Pulla Reddy Groupకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఏక్‌నాథ్‌రెడ్డి వివాహ రిసెప్షన్ మార్చి 2014లో అంగరంగ వైభవంగా హైదరాబాద్‌లోని జేఆర్‌ఎసీ కన్వెన్షన్‌లో జరిగింది. ఏక్నాథ్ రెడ్డి భార్య ప్రగ్యారెడ్డి తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటాడు. పేరున్న కుటుంబం కావడంతో జి.పుల్లారెడ్డి ఫ్యామిలీతో వియ్యం అందుకున్నారు. కానీ.. ఇలా కూతురిని తన అల్లుడు ఇబ్బంది పెడతాడని ఊహించలేదని బాధితురాలి కుటుంబీకులు వాపోతున్నారు. మరి ఏక్ నాథ్ కథనం ఏమిటో, ఇంట్లో గోడ ఎందుకు కట్టాల్సి వచ్చిందో ఆయన పట్టుపడిన తర్వాతే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Hyderabad, Hyderabad police, Wife, Women harrasment