హోమ్ /వార్తలు /క్రైమ్ /

అమానుషం.. కూతురు కన్న ఎక్కువ మార్కులు వచ్చాయని దారుణం.. స్కూల్ టాపర్ బాలిక తల్లి..

అమానుషం.. కూతురు కన్న ఎక్కువ మార్కులు వచ్చాయని దారుణం.. స్కూల్ టాపర్ బాలిక తల్లి..

మణికంఠన్‌ (ఫైల్)

మణికంఠన్‌ (ఫైల్)

Puducherry: తన కూతురు ఎప్పుడు క్లాస్ టాపర్ గా రావాలను కుంది. ఈ మధ్య విడుదలైన ఫలితాల్లో మరో యువకుడికి టాప్ మార్కులు వచ్చాయి. దీన్ని బాలిక తల్లి డైజెస్ట్ చేసుకొలేక పోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Puducherry (Pondicherry), India

పుదుచ్చేరిలో (Puducherry) అమానుష ఘటన చోటు చేసుకుంది. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్‌- మాలతి దంపతుల రెండో కుమారుడు మణికంఠన్‌ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే.. ఈ మధ్యన విడుదలైన రిజల్ట్ లో బాలుడు, విక్టోరియా అనే మహిళ కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని, టాప్ ర్యాంక్ లో నిలిచాడు. దీంతో ఆమె దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయింది. ఎలాగైన బాలుడిని చంపేయాలని స్కెచ్ వేసింది. కూల్‌డ్రింక్‌లో విషం ఇచ్చి బాలుడి చేత తాగించింది. తాగి ఇంటికి వెళ్లిన కాసేపటికే అతడిని వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్టులో విషపదార్థాలు ఉన్నట్లు తెలడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. పాఠశాల ఆవరణలోని సీసీ కెమెరాను పరిశీలించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. కాగా, నిందితురాలు.. విక్టోరియా, తన కూతురి కంటే బాలుడికి ఎక్కువగా మార్కులు వచ్చాయని కోపంతో ఈ పని చేసినట్లు తెలిసింది. దీంతో మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా ఒక మహిళా లాయర్ ముందు క్యాబ్ డ్రైవర్ నీచంగా ప్రవర్తించాడు.

యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)కి చెందిన 23 ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి ఢిల్లీకి వచ్చింది. అయితే.. విమానశ్రయం నుంచి హోటల్ కు వెళ్లడానికి ఒక క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. అతను.. దక్షిణ ఢిల్లీలోని హోటల్‌కు తీసుకువెళుతుండగా ఆమె ముందు హస్తప్రయోగం చేయడం ప్రారంభించారు. దీంతో కారులో ఉన్నవారంతా షాక్ నకు గురయ్యారు. వెంటనే అతనితో వాగ్వాదానికి దిగారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు.. క్యాబ్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

ఆ యువతి తన స్నేహితుడితో కలిసి భారత్‌ను సందర్శించేందుకు వచ్చిందని, వీరిద్దరూ ఢిల్లీ , రాజస్థాన్‌లలో ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఒక యాప్‌లో ఫిర్యాదుదారు, ఆమె స్నేహితురాలు క్యాబ్‌ను బుక్ చేసినప్పుడు ఈ సంఘటన శుక్రవారం జరిగింది. వారిని దక్షిణ ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకువెళుతుండగా, క్యాబ్ డ్రైవర్ కారులో హస్తప్రయోగం చేశాడని పోలీసులు తెలిపారు. “మహిళ, ఆమె స్నేహితుడు డ్రైవర్‌ను పట్టుకుని (అతని చర్యకు) అభ్యంతరం తెలిపారు. అయితే వారితో దురుసుగా ప్రవర్తించి ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు.

First published:

Tags: Crime news, Puducherry

ఉత్తమ కథలు