PUBG PLAYER IN BENGALURU MAKES FAKE BOMB THREAT CALL TO WIN GAME PVN
PUBG player : పబ్జీ ఫ్రెండ్ కోసం ట్రైన్ లో బాంబ్..3గంటల పాటు రైళ్లు నిలిపివేసిన బాలుడు
ప్రతీకాత్మక చిత్రం
PUBG player fake bomb threat call : రైల్వే పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఓ ఫోన్ వచ్చింది. రైలులో బాంబు పెట్టామని అది ఏ క్షణాన్నైనా పేలొచ్చన్నది ఆ ఫోన్ కాల్ లో పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైళ్లను ఎక్కడివక్కడ ఆపేసి బాంబ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్లో బాంబు కోసం తనిఖీలు చేపట్టారు.
PUBG player fake bomb call : పబ్జీ గేమ్ కి బానిసైన ఓ బాలుడు చేసిన పని రైల్వే పోలీసులకు కాసేపు కలవరపెట్టంది. స్పేహితుడితో కలిసి పబ్ జీ గేమ్ ఆడుతున్న 12 ఏళ్ల బాలుడు ఆట మధ్యలో ఆగిపోకూడదన్న పోలీసులకు ఫోన్ చేసి స్నేహితుడు ప్రయాణించాల్సిన రైలులో బాంబు ఉందని చెప్పి మూడు గంటలు రైలు ఆపించాడు. మార్చి 30న బెంగళూరులోని యలహంక రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. 30న మధ్యాహ్నం రైల్వే పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఓ ఫోన్ వచ్చింది. రైలులో బాంబు పెట్టామని అది ఏ క్షణాన్నైనా పేలొచ్చన్నది ఆ ఫోన్ కాల్ లో పేర్కొన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రైళ్లను ఎక్కడివక్కడ ఆపేసి బాంబ్ స్క్వాడ్‌తో కలిసి స్టేషన్లో బాంబు కోసం తనిఖీలు చేపట్టారు. మూడు గంటల పాటు ప్రయాణికులను అనుమతించలేదు. ఆ తర్వాత కాల్ వచ్చిన నంబర్‌కు అధికారులు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇక అధికారులు దర్యాప్తు చేయ చివరికి దానిని ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు.
మార్చి 30న ఫోన్‌కాల్ చేసిన బాలుడి స్నేహితుడు యళహంక రైల్వే స్టేషన్ నుంచి వెళ్తున్న కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. ప్రయాణం మొదలయితే రైలులో సిగ్నల్ సమస్య వస్తుందని,ఆట మధ్యలోనే ఆగిపోతుందని, కాబట్టి ప్రయాణాన్ని ఆపేందుకు ఆ బాలుడు.. రైల్వే పోలీసులకు ఫోన్ చేసి ఆ ట్రైన్లో బాంబు ఉందని చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫోన్ చేసిన అతడు మైనర్ కావడం వల్ల అతడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసు పెట్టకుండా హెచ్చరించి వదిలేశారు అధికారులు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.