పబ్‌జీ గేమ్ కోసం పెళ్లాం పిల్లల్ని వదిలేశాడు...ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా...

పబ్‌జీ గేమ్ కారణంగా ఒక్క బ్రిటన్‌లోనే 200 విడాకులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌లోనూ ఈ గేమ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పిల్లల జీవితాలను నాశనం చేస్తూ.. ప్రాణాలు తీస్తున్న ఈ ప్రమాదకరమై గేమ్‌ని బ్యాన్ చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: February 11, 2019, 4:21 PM IST
పబ్‌జీ గేమ్ కోసం పెళ్లాం పిల్లల్ని వదిలేశాడు...ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా...
PUBG ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 11, 2019, 4:21 PM IST
పబ్‌జీ..పబ్‌జీ..! ఇప్పుడు ఎక్కడ చూసినా దీని పేరే వినిపిస్తోంది..! ఎవరి ఫోన్లో చూసినా ఈ గేమే కనిపిస్తోంది..! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ గేమ్ ఏదైనా ఉందంటే..అది పబ్‌జీయే..! పిల్లలు, యూత్ మొత్తం ఈ గేమ్ మత్తులో మునిగిపోతున్నారు. ఇంట్లో ఉన్నా అదే యావ...కాలేజీలో ఉన్నా అదే ధ్యాస..! పగలే కాదు..రాత్రంతా మేల్కొని మరీ ఆడుతున్నారు. ప్రస్తుతం ఇదో వ్యసనంలా మారిపోయింది. పబ్‌జీ మూలాన ఇళ్లల్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. పచ్చని కాపురాల్లో కూడా చిచ్చుపెడుతోందీ గేమ్. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారంటే..జనాల్నీ పబ్‌జీ ఎంతగా పిచ్చోళ్లను చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా పబ్‌జీ అడిక్షన్‌తో ఓ వ్యక్తి ఏకంగా కుటుంబాన్ని వదులుకున్నాడు. ఆన్‌లైన్ గేమ్ కోసం పెళ్లాం పిల్లలను కాదనుకున్నాడు. భార్య గర్భిణి అన్న కూడా కనికరం లేకుండా తెగదెంపులు చేసుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియకున్నా...సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయింది. దీనిపై నెట్టింట్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తి మొదట తన సోదరుల ద్వారా పబ్‌జీ గురించి తెలుసుకున్నాడు. ప్రారంభ రోజుల్లో అప్పుడప్పుడు మాత్రమే గేమ్ ఆడుతుంటే వాడు. కానీ అదే అలవాటు కొనసాగి.. చివరకు వ్యసనంలా మారిపోయింది. ఉద్యోగానికి కూడా వెళ్లకుండా రోజంతా పబ్‌జీ మత్తులోనే మునిగేవాడు. పెళ్లాం పిల్లలను కూడా పట్టించుకోకుండా రాత్రిళ్లు సైతం అదే యావ..! ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. చివరకు అది విడాకులు తీసుకునే వరకు వెళ్లింది. తనకు కుటుంబం కంటే పబ్‌జీ గేమే ముఖ్యమని..వాళ్లతో తెగదెంపులు చేసుకున్నాడా వ్యక్తి.

ఇలాంటి ఘటన ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగాయి. పబ్‌జీ గేమ్ కారణంగా ఒక్క బ్రిటన్‌లోనే 200 విడాకులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌లోనూ ఈ గేమ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇటీవల ముంబైలో ఓ యువకుడు పబ్‌జీ గేమ్ ఆడేందుకు మొబైల్ కొనివ్వాలని పేరెంట్స్‌ని అడిగాడు. కానీ వారు ఒప్పుకోకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాశ్మీర్‌లో పబ్‌జీకి బానిసైన ఓ ఫిటెనెస్ ట్రైనర్..గేమ్‌లో ఓటమితో మానసికంగా కుంగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పిచ్చోడిగా మారి...తనను తాను తీవ్రంగా గాయపరచుకున్నాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

పిల్లల జీవితాలను నాశనం చేస్తూ.. ప్రాణాలు తీస్తున్న ఈ ప్రమాదకరమై గేమ్‌ని బ్యాన్ చేయాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. స్కూళ్లలో పబ్‌జీ గేమ్ ఆడకాన్ని నిషేధిస్తూ ఇటీవల గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని ఓ కాలేజీ సైతం కళాశాల ప్రాంగణంలో పబ్‌జీ గేమ్‌పై నిషేధం విధించింది. అటు కశ్మీర్‌లోనూ పబ్‌జీపై నిషేధం నిషేధించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పలు విద్యార్థి సంఘాలు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాశాయి. కాగా, ముంబైకి చెందిన ఓ 11 ఏళ్ల అబ్బాయి హైకోర్టు మెట్లెక్కాడు. పిల్లలు, యూత్‌ని మానసికంగా క్రుంగదీస్తున్న పబ్‌జీ గేమ్‌ని నిషేధించాలని పిటిషన్ వేశాడు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...