హోమ్ /వార్తలు /క్రైమ్ /

PUBG Addiction: పబ్ జీ ఆడనివ్వడం లేదని.. తండ్రి తల నరికిన కొడుకు

PUBG Addiction: పబ్ జీ ఆడనివ్వడం లేదని.. తండ్రి తల నరికిన కొడుకు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటర్నెట్ వ్యసనంగా మారుతున్నది. యుక్త వయసు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. స్మార్ట్ ఫోన్ లు చేతికొచ్చిన తర్వాత వారిలో నేర ప్రవృత్తి దారుణంగా పెరిగిపోతున్నది.

 • News18
 • Last Updated :

  యుక్త వయసు పిల్లల్లో ఇంటర్నెట్ వ్యసనంగా మారుతున్నది. స్మార్ట్ ఫోన్ లు చేతిలోకొచ్చిన తర్వాత.. వారు ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి.. దానిని వ్యసనంగా మార్చుకుంటున్నారు. తిండి, నిద్రలు మరిచి.. గంటలపాటు ఆ ఆటల్లోనే మునుగుతున్నారు. వద్దని వారించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇదే తరహా ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పబ్ జీ ఆడనివ్వడం లేదని ఒక యువకుడు ఏకంగా తన తండ్రినే హత్య చేశాడు. తనకు ఎదురు చెబుతున్నాడనే అక్కసుతో ఆ యువకుడు.. కత్తి తీసుకుని తలపై ఒక్క వేటు వేయడంతో ఆ తండ్రి మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  మీరట్ జిల్లా కార్కోడా పట్టణంలోని జముననగర్ కు చెందిన అమీర్.. కొద్దికాలంగా పబ్ జీ ఆడుతూ.. ఆడుతూ.. దానికి బానిసగా మారాడు. ఇదే క్రమంలో గత గురువారం తన తండ్రి ఇర్ఫాన్ వచ్చి.. కొడుకును మందలించాడు. పబ్ జీ ఆడొద్దని హెచ్చరించాడు. కానీ అమీర్ దానిని లెక్కచేయలేదు. ఆ తండ్రి కొడుకును ఈసారి కొంచెం తీవ్రంగానే హెచ్చరించాడు. దీంతో కోపోద్రోక్తుడైన అమీర్.. కత్తిని తీసుకుని తండ్రి తలపై ఒక్క వేటు వేశాడు. అంతే..! రక్తపు మడుగులో తండ్రి..

  PUBG, crime, uttarapradesh crime news, son killed father, meerut, meerut news, murder
  ప్రతీకాత్మక చిత్రం

  తండ్రిని చంపిన ఆ యువకుడు.. తాను కూడా గాయపరుచుకున్నాడు. అదే కత్తితో అమీర్ కూడా గాయాలు చేసుకున్నాడు. కాగా, అమీర్ మాధక ద్రవ్యాలకు బానిసయ్యాడని తెలిసింది. ఇదే విషయమై అమీర్ కుటుంబసభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్ జీ ఆడొద్దని అన్నందుకే అతడు ఈ పని చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: PUBG

  ఉత్తమ కథలు