PUBG Game: పబ్‌జీ అడనివ్వడం లేదని కన్నతండ్రి తల నరికిన తనయుడు...

నిత్యం స్మార్ట్ ఫోన్ లో పబ్ జీ గేమ్‌కే సమయం అంతా వేస్ట్ చేస్తుండటంతో తండ్రి శంకర్ కొడుకును మందలించాడు, అంతే కాదు స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించడం ఆపేశాడు. దీంతో పబ్ జీ గేమ్‌కు బానిస అయిన నిందితుడు రఘువీర్ తండ్రిపై అకారణంగా కోపం పెంచుకున్నాడు.

news18-telugu
Updated: September 9, 2019, 11:07 PM IST
PUBG Game: పబ్‌జీ అడనివ్వడం లేదని కన్నతండ్రి తల నరికిన తనయుడు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పబ్జీ గేమ్ దెబ్బకు మరో నిండు ప్రాణం బలయ్యింది. కన్న కొడుకే ఈ ఆన్ లైన్ మహమ్మారి గేమ్ ఆడనివ్వడం లేదని తండ్రి పీక కోసి హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నిందితుడు రఘువీర్ నిత్యం పబ్జీ గేమ్ లోనే మునిగిపోతూ చదువు సంధ్య వదిలేశాడు. దీంతో కొడుకు భవిష్యత్తుపై తండ్రికి చింత పెరిగింది. నిత్యం స్మార్ట్ ఫోన్ లో పబ్ జీ గేమ్‌కే సమయం అంతా వేస్ట్ చేస్తుండటంతో తండ్రి శంకర్ కొడుకును మందలించాడు, అంతే కాదు స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించడం ఆపేశాడు. దీంతో పబ్ జీ గేమ్‌కు బానిస అయిన నిందితుడు రఘువీర్ తండ్రిపై అకారణంగా కోపం పెంచుకున్నాడు.

ఆగ్రహం కట్టలు తెంచుకొని తండ్రిని గొంతు కోసి హత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు శంకర్ మూడునెలల క్రితమే పోలీస్ సర్వీసు నుంచి రిటైర్ అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆన్ లైన్ మహమ్మారి గేమ్ వల్ల ఇప్పటికే పలు ప్రమాదాలతో పాటు హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. గేమ్ ఆడేవారి మానసిక స్థితిని కూడా పబ్ జీ ప్రభావితం చేస్తోందని పలు సర్వేలు వెల్లడించాయి.
First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading