మరో ప్రేమోన్మాది ఘాతుకం... యువతిపై కత్తితో దాడి

నిందితుడు మహేష్ హైదరాబాద్‌లో డ్రైవర్‌తో పాటు బాడీగార్డ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో షూటింగ్ నిమిత్తం పాలకొల్లుకు వచ్చిన మహేష్‌కు మహిత పరిచయం అయ్యింది.

news18-telugu
Updated: April 29, 2019, 10:55 AM IST
మరో ప్రేమోన్మాది ఘాతుకం... యువతిపై కత్తితో దాడి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖ జిల్లా యలమంచిలిలో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. మహేష్ అనే వ్యక్తి మహిత అనే యువతిపై నిర్దాక్షణ్యంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన యువతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పారిపోయాడు. ఆ యువకుడి వెంట వచ్చిన మరో వ్యక్తి దొరికిపోగా.. స్థానికులు చితకబాదారు. అతడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు.  భీమవరం మండలం బేతపూడికి చెందిన మహిత ఇంటర్మీడియట్ చదువుతోంది. వేసవి సెలవుల కావడంతో.. బేతపూడి నుంచి కాజుగుప్పం బంధువుల ఇంటికి వచ్చింది. తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచి వెళుతుండగా.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వచ్చిన నిందితుడు గొంతు కోశాడు.

వివరాల్లోకి వెళ్తే... నిందితుడు మహేష్ హైదరాబాద్‌లో డ్రైవర్‌తో పాటు బాడీగార్డ్‌గా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో షూటింగ్ నిమిత్తం పాలకొల్లుకు వచ్చిన మహేష్‌కు మహిత పరిచయం అయ్యింది. వీరిద్దరు పదిరోజుల పాటు హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉన్నట్లుగా కూడా సమాచారం. అయితే కొన్నిరోజుల క్రితం మహిత హైదరాబాద్ నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లానని చెప్పుకొచ్చింది. మహేష్‌కు వివాహం జరిగి భార్యతో విడాకులు కూడా అయినట్లు సమాచారం. మహితను పెళ్లి చేసుకోవాలనుకున్న మహేష్ ఆమెకు రెండు నుంచి మూడు లక్షల వరకు డబ్బులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు కారణంగానే మహితను మహేష్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అనూష అనే మరో యువతి కోసం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

 
First published: April 29, 2019, 10:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading