వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. పక్కా సమాచారంతో..

ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరులో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో పోలీసులు మురకంబట్టులోని ఓ ఇంటిపై దాడులు నిర్వహించి... నలుగురు యువతులు,ఓ విటుడిని పట్టుకున్నారు.

  • Share this:
    చిత్తూరులో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో పోలీసులు మురకంబట్టులోని ఓ ఇంటిపై దాడులు నిర్వహించి... నలుగురు యువతులు,ఓ విటుడిని పట్టుకున్నారు. చుట్టు పక్కాల పట్టణాల నుంచి యువతులను తీసుకొచ్చి బలవంతంగా వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు. ఇటీవల తమ స్థావరాన్ని మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. యువతులతో సహా తమ స్థావరాన్ని వేరే రాష్ట్రాలకు మార్చాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అందింది.

    వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసేందుకు కొంతమంది పోలీసులను మొదట విటుల లాగా అక్కడికి పంపించారు. వారు మఫ్టీలో ఉండటంతో ఆ ముఠా గుర్తించలేకపోయింది. అందరితో మాట్లాడినట్టే వారితోనూ బేరసారాలు సాగించింది.ఇంతలో రంగంలోకి దిగిన మిగతా పోలీసులు.. అందరిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో విటుడి నుంచి రూ.5వేలు,రూ.30వేలు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని చెప్పారు. అదుపులోకి తీసుకున్న యువతులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి స్వగ్రామాలకు పంపించాలనుకున్నట్టు సమాచారం.
    Published by:Srinivas Mittapalli
    First published: