Home /News /crime /

PROSTITUTION RACKET BUSTED IN UTTAR PRADESH POLICE ARRESTED 23 PERSONS INCLUDING 12 WOMAN FULL DETAILS HERE HSN

హోటల్ లో వ్యభిచార దందా.. తనిఖీలు చేస్తున్న పోలీసులకే మైండ్ బ్లాక్.. కండోమ్స్, పిల్స్ ఎన్ని ఉన్నాయో చూసి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఒక్కో గదిని తనిఖీలు చేశారు. అంతే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకరిద్దరు కాదు ఏకంగా 23 మందిని అరెస్ట్ చేశారు.

    అదో హోటల్. పక్కా ప్లాన్ తో పదుల సంఖ్యలో పోలీసులు ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. హోటల్ ఎంట్రీ వద్ద కొందరు పోలీసులు ఉండి, మరికొందరు గదుల్లో రైడింగ్ కు వెళ్లారు. ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక్కో గదిని తనిఖీ చేస్తున్న కొద్దీ పోలీసుల కళ్లు బైర్లు కమ్మాయి. ఓ భారీ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకోగలిగారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 12 మంది యువతులతో వ్యభిచారాన్ని గుట్టుగా నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతుల కోసం వచ్చిన విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్ నిర్వాహకుడి సహాయంతో ఆ సెక్స్ రాకెట్ ముఠా చేస్తున్న దందాను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. అయితే స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉందని ఉన్నతాధికారులకు తేలడంతో వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలోని ఓ హోటల్ లో శనివారం రైడింగ్ జరిగింది. ఆ హోటల్ లో వ్యభిచారం జరుగుతోందనీ, ఎంతో కాలంగా గుట్టుగా ఈ పాడుపనిని నిర్వహిస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో స్థానిక పోలీసులు కూడా ఆ వ్యభిచార దందాలో పాలు పంచుకుంటున్నారనీ, వారికి కూడా పెద్ద మొత్తంలో డబ్బును ముట్ట జెబుతున్నారని చెప్పడంతో ఉన్నతాధికారులే స్వయంగా రంగంలోకి దిగారు. పెద్ద సంఖ్యలో పోలీసులతో ఆ హోటల్ పై దాడులు నిర్వహించారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

    ఈ దాడుల్లో 12 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు 11 మంది విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు హోటల్ నిర్వాహకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వేల సంఖ్యలో కండోమ్స్, పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంత భారీ స్థాయిలో కండోమ్స్, పిల్స్ లభ్యమవడంతో పోలీసులే నివ్వెర పోయారు. ఎంతో కాలంగా ఈ దందా సాగుతున్నట్టు గ్రహించారు. ఈ ఘటనపై గ్రేటర్ నొయిడా అసిస్టెంట్ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక పోలీసులు కూడా ఈ సెక్స్ రాకెట్ కు సహాయం చేస్తున్నారని తమకు తెలిసిందనీ, వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Uttar pradesh, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు