కేజీఎఫ్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు...కాలేజీ అమ్మాయిలే టార్గెట్ ...

అమ్మాయిలను ఉద్యోగం పేరిట ఎరవేసి, వారిని వ్యభిచారం రొంపిలోకి ఈ ముఠా దింపుతోంది. వీరిని బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరులకు సప్లయి చేస్తోంది.

news18-telugu
Updated: March 26, 2020, 3:50 PM IST
కేజీఎఫ్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టు...కాలేజీ అమ్మాయిలే టార్గెట్ ...
సెక్స్ రాకెట్ గుట్టు రట్టు...(File)
  • Share this:
ఆంధ్ర, కర్నాటక బార్డర్ లోని కోలార్ ప్రాంతంలో భారీ సెక్స్ రాకెట్ బద్దలైంది. కాలేజీ అమ్మాయిలు, ఇళ్లలో ఉండే ఒంటరి మహిళలనే టార్గెట్ చేసినచ ముఠా వాట్సప్, సహా ఇతర యాప్స్ సహాయంతో విటులకు కాల్ గర్ల్స్ సప్లయ్ చేస్తూ పోలీసులకు పట్టుబడింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన అమ్మాయిలను ఉద్యోగం పేరిట ఎరవేసి, వారిని వ్యభిచారం రొంపిలోకి ఈ ముఠా దింపుతోంది. వీరిని బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూరులకు సప్లయి చేస్తోంది. కాల్ గర్ల్స్ గా మారిన వారికి తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తూ, విటుల నుంచి భారీగా వసూలుచేస్తోంది. గత వారం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో ఈ ముఠాను అరెస్టు చేశారు. వీరి నుంచి 16 మంది అమ్మాయిలను చెర నుంచి విడిపించారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు