Prostitution Racket: వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. ప్రధాన నిందితుడు మాజీ సైనికోద్యోగి

ప్రతీకాత్మక చిత్రం

సైన్యంలో ఉద్యోగం అంటే సమాజంలో ఎంతో గౌరవం. అంతటి గౌరవ ప్రదమైన ఉద్యోగం చేసిన వ్యక్తి.. ఉద్యోగ విరమణ తర్వాత ఉన్నతంగా మెలాగాల్సి‌న అవసరం ఉంది. కానీ ఆ వ్యక్తి బుద్ధిగడ్డి తింది.

  • Share this:
    సైన్యంలో ఉద్యోగం అంటే సమాజంలో ఎంతో గౌరవం. అంతటి గౌరవ ప్రదమైన ఉద్యోగం చేసిన వ్యక్తి.. ఉద్యోగ విరమణ తర్వాత ఉన్నతంగా మెలాగాల్సి‌న అవసరం ఉంది. కానీ ఆ వ్యక్తి బుద్ధిగడ్డి తింది. నిస్సహాయురాలైన మహిళలను వ్యభిచార రొంపిలో దించి అక్రమార్జనకు అలవాటు పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర శివారు కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడుపుతున్న ఆ మాజీ సైనికుడి బండరాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉట్నూర్‌లోని గంగన్న పేటకు కాలనీకి చెందిన పిండి మల్లికార్జున్ ఆదిలాబాద్ లోని టీచర్స్ కాలనిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు.

    నిస్సహాయులైన మహిళలతో ఈ తతంగం నెరుపుతున్నాడు. ఈ సమాచారం తెలిసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు పిండి మల్లికార్జున్ తో పాటు ఇద్దరు విటులను, ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సెల్ ఫోన్లు, డైరీలు, 7,700 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సీఐలు ఈ చంద్రమౌళి, పురుషోత్తం చారి ఆధ్వర్యంలో ఈ దాడులను నిర్వహించారు.

    అరెస్టైన ఇద్దరు విటుల్లో ఒకరు కరీంనగర్ పట్టణం రాంనగర్ కాలనీకి చెందిన సిందం కుమార్ కాగా, మరొకరు తాంసి మండలం ఘోట్ కూరి గ్రామానికి చెందిన
    దర్శనాల సాయికుమార్. ఆదిలాబాద్ గ్రామీణ సిఐ కె. పురుషోత్తం చారి మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులచే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇటువంటి కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: