• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • PROSTITUTION RACKET BUSTED AT SPA CRIME MK

స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు...

స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు...

ప్రతీకాత్మక చిత్రం

పేరుకే మసాజ్ సెంటర్ అని బోర్డు పెట్టి.. లోపల మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పలువురు యువతులను, విటులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

  • Share this:
    అహ్మదాబాద్ లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. గోల్డెన్ స్పా పేరుతో సాగుతున్న వ్యభిచార దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. టాస్క్‌ఫోర్స్ దాడి విషయం తెలుసుకున్న ముఠా అసలు సూత్రధారుడు మాత్రం పరారైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. వ్యభిచార దందాకు సంబంధించి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారం ప్రకారం.. బిజినెస్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఉన్న గోల్డెన్ స్పాపై దాడి చేశారు. లోపల శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న పలువురు యువతులను, విటులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

    పేరుకే మసాజ్ సెంటర్ అని బోర్డు పెట్టి.. లోపల మాత్రం వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. స్పా నిర్వాహకులైన ముగ్గురితో సహా పలువురిని అదుపులోకి తీసుకోగా.. ప్రధాన నిందితులు జిగ్నేష్ పరారీలో ఉన్నట్టు సమాచారం. స్పాలో దాడి సందర్భంగా నగదుతో పాటు, పట్టుబడ్డ యువతీ యువకుల సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు